వెండితెరపై నటీనటుల మధ్య ఎంత కాంపిటిషన్ ఉంటుందో బుల్లితెరపై యాంకర్ల మధ్య కూడా అంతే పోటీ ఉంటుంది. టాప్ రేసులో సుమ దూసుకుపోతుంటే ఆ తరువాత స్థానాల్లో అనసూయ, రష్మి తమ గ్లామర్ షోతో నిలిచారు. మరోపక్క శ్రీముఖి కూడా ఫేమస్ అయిపోతుంది.

ఏవైనా అవకాశాలు రావాలంటే వీరందరినీ దాటుకొనే మరో యాంకర్ కి వెళ్లాలి. ఇంతటి భారీ కాంపిటిషన్ లో కొంతమంది లేడీ యాంకర్లు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. క్రేజ్ కోసమో, పాపులర్ అవ్వడం కోసమో చేస్తున్నారో కానీ సోషల్ మీడియాలో మాత్రం వారు చేసే పనుల కారణంగా విమర్శలపాలవుతున్నారు.

టోటల్ సినిమానే ఏకిపారేసిన ట్రోలర్స్.. తలలు పట్టుకున్న హీరోలు!

తాజాగా ఓ యాంకర్ లైవ్ లో చేసిన పనికి అందరూ షాకవుతున్నారు. ఇంతకీ ఆమె ఏం చేసిందో తెలుసా.. అభిమాని బుగ్గ కోరికేసింది. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ ఛానెల్ లో 'పటాస్' షో ఎంత ఫేమస్ అయిందో తెలిసిందే. శ్రీముఖి యాంకర్ గా చేసిన ఈ షో మంచి టీఆర్పీ రేటింగ్స్ తీసుకొచ్చింది. అయితే ఆమె బిగ్ బాస్ షోకి వెళ్లడంతో ఈ షోకి దూరమైంది.

ఆమె స్థానంలో చలాకీ చంటిని తీసుకొచ్చారు షో నిర్వాహకులు. చంటితో కలిసి యాంకర్ వర్షిణి కూడా ఈ షోకి యాంకరింగ్ చేస్తోంది. షోలో భాగంగా యాంకర్లు కొన్ని ప్రశ్నలు అడిగి.. స్టూడెంట్స్ తో సమాధానాలు చెప్పిస్తారు.

ఈ క్రమంలో వారు అడిగిన ఓ ప్రశ్నకి సమాధానం చెప్పడానికి నిల్చున్న ఓ అబ్బాయిని చూసి చాలా క్యూట్ గా ఉన్నాడంటూ స్టేజ్ పైకి పిలిచింది వర్షిణి. అక్కడితో ఆగలేదు.. అతడిని పట్టుకొని బుగ్గ కోరికేసింది. దీంతో అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.