'కేజీఎఫ్' సినిమాతో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్నాడు కన్నడ స్టార్ యష్. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ ఒక్క సినిమాతో యష్ కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు.

ప్రస్తుతం ఈ సినిమాకి కొనసాగింపుగా 'కేజీఎఫ్ 2'ని రూపొందిస్తున్నారు. ఇటీవల జరిగిన ఓ అవార్డు వేడుకలో టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండతో పాటు యష్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 'యష్ నుండి ఓ వస్తువుని దొంగిలించమంటే దేన్ని దొంగిలిస్తారు..?' అని స్టేజ్ పై ఉన్న విజయ్ ని అడిగారు.

నాకు శ్రీదేవి కంటే పవనే ఇష్టం.. వర్మ కామెంట్స్!

దానికి ఆయన ఏ మాత్రం తడుముకోకుండా వెంటనే 'ప్రశాంత్ నీల్' అని సమాధానం చెప్పాడు. అనంతరం విజయ్ నవ్వుతూ.. 'ఆయన్ని దొంగిలిస్తే రహస్యంగా 'కేజీఎఫ్ 3' పనులు మొదలుపెట్టొచ్చని' అంటూ సరదాగా అన్నారు. ప్రస్తుతం విజయ్ 'వరల్డ్ ఫేమస్ లవర్' అనే సినిమాలో నటిస్తున్నారు.

ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. క్రాంతి మాధవ్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. మరోపక్క పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేస్తోన్న 'ఫైటర్' సినిమాలో కూడా విజయ్ నటించబోతున్నాడు. అలానే దిల్ రాజు బ్యానర్ లో ఓ సినిమాకి గ్రీన్ ఇచ్చాడు. దీనికి శివ నిర్వాణ దర్శకత్వం వహించనున్నారు.