ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి క్షమాపణలు చెప్పారు. వర్మ నిర్మాతగా వ్యవహరిస్తోన్న సినిమా 'బ్యూటీఫుల్' సినిమా కొత్త ఏడాది సందర్భంగా జనవరి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. నైనా గంగూలీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ప్రీ న్యూఇయర్ రిలీజ్ వేడుకలో వర్మ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.

ఈ వేడుకలో వర్మ.. పవన్ ని ఉద్దేశించి మాట్లాడారు. గతంలో పవన్ పై చేసిన వ్యాఖ్యల నేపధ్యంలో క్షమాపణలు కోరారు. ఇవాళ నా మనసులోని మాటలు చెప్పాలనుకుంటున్నా అంటూ మొదలెట్టిన వర్మ.. పవన్ కి ఓ మాట చెప్పాలనుకుంటున్నా అని అన్నారు.

మతిపోగొట్టే సొగసు.. ప్రియమణి గ్లామర్ కి ఫిదా(ఫొటోస్)

'పవన్ గారికి తిక్కుంది.. నాకు లెక్కుంది.. కానీ నా లెక్కకన్నా... తిక్కే అందరికీ నచ్చుతుంది. అందుకే ఆయన సూపర్ స్టార్ అయ్యారు.. నన్ను క్షమించండి పవన్ గారు అంటూ కోరారు. ప్రమాణం చేసి చెబుతున్నా.. నాకు శ్రీదేవి కంటే పవనే ఇష్టం.. నేను దేవుడ్ని నమ్మను.. మీరు నా మాటలు నమ్మకపోతే నేనేం చేయలేను అంటూ కామెంట్స్ చేశారు.

గతంలో మెగాఫ్యామిలీని ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ తన సోషల్ మీడియాలో ఎన్నో ట్వీట్లు చేశాడు వర్మ. ప్రతీ ట్వీట్ లో కూడా పవన్ ని తక్కువ చేయడం, లేదా ఆయనపై విమర్శలు చేయడం వంటివి చేశాడు వర్మ.

ఇప్పుడు కూడా వర్మ.. పవన్ కి క్షమాపణలు చెప్పింది తన సినిమా ప్రమోషన్స్ కోసమే.. మొత్తానికి మరోసారి పవన్ పేరు వాడుకొని తన సినిమాని వార్తల్లో నిలిచేలా చేశాడు.