టాలీవుడ్ యంగ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తన సినిమాల ప్రమోషన్స్ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాడో తెలిసిందే. ఒక్కో సినిమాకి ఒక్కో రకమైన స్ట్రాటజీ వాడుతూ సినిమాకి మంచి ఓపెనింగ్స్ తీసుకొస్తుంటాడు. 'డియర్ కామ్రేడ్' సినిమా సమయంలో అతడు చేసిన సందడి అంతా ఇంతా కాదు.

అలాంటిది తన కొత్త సినిమా 'వరల్డ్ ఫేమస్ లవర్' విషయంలో మాత్రం విజయ్ దేవరకొండ చాలా సైలెంట్ గా ఉంటున్నాడు. పోస్టర్లు, పాటలు రిలీజ్ చేయడం తప్ప కొత్తగా ఎలాంటి ప్రమోషన్స్ చేయడం లేదు.

విజయ్ దేవరకొండకి పోటీగా స్టార్ కమెడియన్!

పబ్లిసిటీ బాగా చేసి చేసి, భారీ హైప్ తీసుకురావడం వలన 'డియర్ కామ్రేడ్'కి ఫ్లాప్ టాక్ వచ్చింది కాబట్టి ఈసారి లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తున్నాడా..? లేక ఈ సినిమాపై అతడికి నమ్మకం లేదా అనే సందేహాలు కలుగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమాకి ఓపెనింగ్స్ అనేవి చాలా ముఖ్యం.

మొదటి వారంలో ఎంత రాబట్టుకుంటే అంత బెటర్.. అందుకే ఈ మధ్యకాలంలో అన్ని సినిమాలకు ప్రమోషన్స్ ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. అయితే ప్రమోషన్స్ ని బాగా నమ్మే విజయ్ దేవరకొండ మాత్రం ఈసారి ఇంకా తన ప్రమోషన్స్ మొదలుపెట్టకపోవడం ఆశ్చర్యంగా ఉంది.

ఈ విషయం బయ్యర్లకు మింగుడు పడడం లేదు. సినిమా రిలీజ్ కి సరిగ్గా పదిరోజులు మాత్రమే ఉంది. మరి ఇప్పటికైనా విజయ్ చొరవ తీసుకుంటాడేమో చూడాలి!