ప్రేమికులు రోజు ఫిబ్రవరి 14 ..లవర్స్ మాట ఎలా ఉన్నా సినీ ప్రేమికులకు మాత్రం ఎప్పుడూ పండగే. ఆ రోజున ప్రత్యేకంగా తమ సినిమాలు రిలీజ్ లు పెట్టుకుంటూంటారు. అదే కోవలో తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం రిలీజ్ అవుతోంది. అంతేకాదు తమిళ స్టార్ కమిడియన్ నటించిన ‘సర్వర్‌ సుందరం’ సైతం తెలుగులో అదే రోజు రిలీజ్ అవుతోంది. అయితే ఈ రెండు సినిమాలకు పోలిక లేకపోయినా పోటీ ఉంటుందంటున్నారు. ‘సర్వర్‌ సుందరం’ సినిమా ఫుల్ లెంగ్త్ కామెడీతో రూపొందిందని చెప్తున్నారు.

ఒకప్పుడు హాస్య నటుడు నగేష్‌ నటించగా ఘన విజయం సాధించిన చిత్రం ‘సర్వర్‌ సుందరం’.  ఇప్పుడు అదే టైటిల్ తోనే  తెరకెక్కిన చిత్రంలో సంతానం హీరోగా నటించారు. ఆనంద్‌ బాల్కి దర్శకత్వం వహించారు. ఈ సినిమా కోసం సంతానం హోటల్ సర్వర్ గా ట్రైనింగ్ సైతం తీసుకున్నారు. 2016లోనే ఈ సినిమా పూర్తైంది. అయితే రకరకాల కారణాలతో నాలుగేళ్ల తర్వాత ఈ సినిమా రిలీజ్ కు సిద్దమైంది. అలాగే తెలుగులోనూ ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు.

ఇలా జరుగుతోందేంటి.. షాక్ లో విజయ్ దేవరకొండ!

తన కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించిన కమిడియన్ సంతానం ఈ కమర్షియల్ కామెడీ ఎంటెర్టైనెర్ లో హీరో గా ఆడియన్స్ ని ఫుల్ గా అలరించబోతున్నారు. అలానే ఈ సినిమాలో హీరోయిన్ వైభవి సంతానంకు జోడిగా నటించింది. ప్రముఖ నటుడు రాధా రవి ఈ మూవీలో కీలక పాత్రలో నటించడం జరిగింది.

కామెడీ ఎంటర్టైన్మెంట్ తో పాటు మాస్ ఆడియన్స్ కు కావాల్సిన యాక్షన్ సన్నివేశాలు ఈ మూవీలో ఉండడం విశేషం. బల్కి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాను ఉదయ్ హర్ష వడ్డెల, డి.వెంకటేష్ నిర్మాతలు. ఫిబ్రవరి 14న తెలుగులో భారీ రేంజ్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి అని నిర్మాతలు తెలిపారు.