టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నుంచి రాబోతున్న నెక్స్ట్ మూవీ వరల్డ్ ఫెమస్ లవర్. ఇటీవల నిర్మాతగా మీకు మాత్రమే చెప్తా సినిమాని నిర్మించి ప్రేక్షకుల ముందుకు తెచ్చిన విజయ్ అనుకున్నంతగా సక్సెస్ అందుకోలేకపోయారు.ఇక కొన్నాళ్ళు ప్రొడక్షన్ హౌజ్ ని పక్కనపెట్టి తన రెగ్యులర్ వర్క్ తో బిజీ అవుతున్నాడు.

వరల్డ్ ఫెమస్ లవర్ సినిమా షూటింగ్ ఇప్పటికే తుది దశకు చేరుకుంది.   చివరగా విజయ్ డియర్ కామ్రేడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. నెక్స్ట్ సినిమా వరల్డ్ ఫెమస్ లవర్ సినిమాతో ఎలాగైనా మంచి సక్సెస్ అందుకోవాలని రౌడీ స్టార్ ప్లాన్ చేసుకుంటున్నాడు.

ఎన్టీఆర్ తో ఇష్టంలేకుండా సినిమా చేశా.. డైరెక్టర్ హాట్ కామెంట్స్!

సినిమాకు సంబందించిన రిలీజ్ డేట్ పై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ అయితే ఇవ్వలేదు గాని నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేయాలనీ చర్చలు జరిగినట్లు టాక్ వచ్చింది.  కానీ ఆ సమయంలో శేఖర్ కమ్ముల - నాగ చైతన్య - సాయి పల్లవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రొమాంటిక్ లవ్ స్టోరీ రిలీజ్ కానుంది. అలాగే నితిన్ భీష్మ కూడా అదే నెలలో రానుంది. దీంతో విజయ్ వరల్డ్ ఫెమస్ లవర్ సినిమా రిలీజ్ డేట్ పై కన్ఫ్యూజన్ నెలకొంది.

మార్చ్ లో రిలీజ్ చేయడానికి విజయ్ ఇష్టపడటం లేదు. ఎగ్జామ్స్ మూమెంట్ లో సినిమా యూత్ కి చేరువవ్వడం చాలా కష్టమని ఫిబ్రవరిలో ఎదో ఒక డేట్ ని ఫిక్స్ చేయాలనీ అనుకుంటున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీపై స్పెషల్ ఎనౌన్స్మెంట్ వెలువడనుంది. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాకు  గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.