రౌడీ హీరో విజయ్ దేవరకొండ మరోసారి ఎమోషనల్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. విజయ్ దేవరకొండ నటించిన 'వరల్డ్ ఫేమస్ లవర్' చిత్రం వాలంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో నేడు చిత్ర యూనిట్ ట్రైలర్ రిలీజ్ చేశారు. 

విజయ్ దేవరకొండ మార్క్ పెర్ఫామెన్స్, నలుగురు హీరోయిన్ల గ్లామర్, ఎమోషనల్ కంటెంట్ తో ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన ఐశ్వర్య రాజేష్, రాశి ఖన్నా, కేథరిన్, ఇజా బెల్లె హీరోయిన్లుగా నటించారు. నలుగురు హీరోయిన్లతో తొలిసారి విజయ్ దేవరకొండ రొమాన్స్ చేస్తుండడంతో ఆసక్తి నెలకొంది. 

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ మాట్లాడాడు. సాధారణంగా విజయ్ దేవరకొండ సినిమా అంటే ఓ హడావిడి ఉంటుంది. వరల్డ్ ఫేమస్ లవర్ చిత్ర ట్రైలర్ రిలీజ్ కాగానే ఆ హడావిడి మొదలవుతుంది అని విజయ్ దేవరకొండ అన్నాడు. 

కోడి రామకృష్ణ కుమార్తె వివాహ వేడుకలో చిరంజీవి, బాలయ్య.. సెలెబ్రిటీల సందడి

బహుశా వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రమే తన చివరి ప్రేమ కథా చిత్రం ఏమో అని విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ చిత్రంలో తామంతా ఎంతో ప్రేమని నింపి నటించామని విజయ్ దేవరకొండ తెలిపాడు. ఈ చిత్రంలో నలుగురు హీరోయిన్లు పెర్ఫామెన్స్ చంపేశారని ప్రశంసించాడు. ఈ చిత్రం మంచి విజయం సాదిస్తుందని విజయ్ దేవరకొండ ఆశాభావం వ్యక్తం చేశాడు. 

బాబీతో ఓకె.. మరి ఆ డైరెక్టర్ తో.. ఇచ్చిన మాట కోసం పవన్ షాకింగ్ డెసిషన్!