వైజాగ్ లో ముద్దులు కురిపించిన విజయ్ దేవరకొండ.. గళ్ళ లుంగీ, తలపాగాతో రచ్చ!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్. సున్నితమైన ప్రేమకథా చిత్రాల దర్శకుడు క్రాంతిమాధవ్ ఈ చిత్రానికి దర్శకుడు. విజయ్ దేవరకొండ సరసన ఈ చిత్రంలో రాశి ఖన్నా, కేథరిన్, ఇజాబెల్లా, ఐశ్యర్యారాజేష్ లు నటించారు. 

Vijay Devarakonda speech at Vizag

రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్. సున్నితమైన ప్రేమకథా చిత్రాల దర్శకుడు క్రాంతిమాధవ్ ఈ చిత్రానికి దర్శకుడు. విజయ్ దేవరకొండ సరసన ఈ చిత్రంలో రాశి ఖన్నా, కేథరిన్, ఇజాబెల్లా, ఐశ్యర్యారాజేష్ లు నటించారు. 

వాలంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న ఈ చిత్రం రిలీజ్ కు రెడీ అవుతుండడంతో ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. నేడు చిత్ర యూనిట్ వైజాగ్ లో గ్రాండ్ గా రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ సరికొత్త గెటప్ లో కనిపించాడు. గళ్ళ లుంగీ, తలపాగా ధరించి వేదికపైకి వచ్చాడు. 

షాకింగ్ ఫొటోలు: టీవి హీరోయిన్ ...ఇంత హాట్ గా ఉందంటే నమ్మలేరు

విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. తాను ముంబైలో షూటింగ్ లో బిజీగా ఉండగా తనకు దర్శకుడు, నిర్మాత ఫోన్ చేసి విజయ్ త్వరగా రా.. ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలి.. బజ్ తీసుకురావాలి అని చెప్పారు. నేను ఇంతకు ముందే చెప్పా. విజయ్ దేవరకొండ సినిమా అంటే అభిమానులే బజ్ క్రియేట్ చేస్తారు. 

తాము ఎలాంటి ప్రమోషన్స్ చేయకుండానే ఈ చిత్రాన్ని అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోతున్నాయి. అది చూసి తాను ఆశ్చర్యపోయానని విజయ్ తెలిపాడు. అభిమానులకు గాల్లో ముద్దులు కురిపిస్తూ విజయ్ దేవరకొండ ఎప్పటిలాగే సందడి చేశాడు. ఫిబ్రవరి 14న నాలుగు రకాల షేడ్స్ ఉండే ప్రేమ కథా చిత్రంతో మీ ముందుకు రాబోతున్నట్లు విజయ్ తెలిపాడు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios