Asianet News TeluguAsianet News Telugu

''టాలెంట్ లేకుండా ఎంతమందితో పడుకుంటే ఏంటి..?''

 'వైఫే' అనే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన గుంజన్ తాజాగా చేసిన కొన్ని బోల్డ్ స్టేట్మెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ప్రొఫెషన్ కోసం ఓ నటి ఎక్స్ పోజింగ్ చేస్తే ఆమెని పోర్న్ స్టార్ అని ఎలా అంటారని ప్రశ్నించింది.

actress gunnjan bold comments on casting couch
Author
Hyderabad, First Published Jan 3, 2020, 3:36 PM IST

టాలెంట్ లేనప్పుడు ఎంతమందితో పడుకుంటే ఏం లాభమని నేరుగానే ప్రశ్నిస్తోంది హీరోయిన్ గుంజన్. ముంబై నుండి సౌత్ సినీ ఇండస్ట్రీకి వచ్చే హీరోయిన్లపై చెడు అభిప్రాయాలు చాలానే ఉంటాయని.. డబ్బుల కోసం ఎలాంటి నీచమైన పాత్రలు చేయడానికైనా వెనుకాడరని అనుకుంటారని.. కానీ తను అలాంటి దాన్ని కానని చెబుతోంది గుంజన్. 'వైఫే' అనే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన గుంజన్ తాజాగా చేసిన కొన్ని బోల్డ్ స్టేట్మెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ప్రొఫెషన్ కోసం ఓ నటి ఎక్స్ పోజింగ్ చేస్తే ఆమెని పోర్న్ స్టార్ అని ఎలా అంటారని ప్రశ్నించింది. నలుగురు అమ్మాయిలు లంగావోనీ వేసుకొని ఒక అమ్మాయి పొట్టి గౌన్ వేసుకుంటే.. కచ్చితంగా జనాలు గౌన్ వేసుకున్న అమ్మాయినే చూస్తారని.. ప్రస్తుతం సమాజం అలా ఉందని చెప్పింది.

వరస ప్లాప్ లకు చెక్.. ఒక్క హిట్టుతో మళ్లీ గ్రేస్ లోకి!

తను నటించిన 'వైఫే' సినిమాకి ముందు రెండు, మూడు వెబ్ సిరీస్ లో నటించినట్లు చెప్పింది. ప్రస్తుతం తన చేతిలో రెండు తెలుగు సినిమాలున్నాయని..  'వైఫే'కి వచ్చే రెస్పాన్స్ బట్టి వాటిని ఓకే చేయాలో వద్దో చూస్తానని చెప్పారు. తనను చాలా మంది ఇంటర్వ్యూలలో 'ఇలాంటి సినిమాలు చేయడానికి సిగ్గుగా లేదా' అని అడుగుతుంటారని.. అసలు సిగ్గెందుకు ఉండాలని ఎదురు ప్రశ్నించింది.

తనకి అందమైన ఫిగర్ ఉంది కాబట్టి అందరికీ చూపించుకోవాలని అనుకుంటున్నానని.. అందులో తప్పు లేని.. కిస్ లు, బికినీలు లేని సినిమాలు ఏవైనా ఉన్నాయా..? అని ప్రశ్నించింది. ఒకవేళ సినిమాలో ప్రైవేట్ పార్ట్స్ చూపించడం లాంటివి చేస్తుంటే అప్పుడు తప్పు కదా అని ప్రశ్నించవచ్చని అన్నారు. అలానే కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ.. అన్ని చోట్లా ఈ సమస్య ఉందని అన్నారు.

చాలా మంది దర్శకనిర్మాతలు కమిట్మెంట్ కావాలని అడిగారని.. అవకాశాల కోసం ఆ పని చేయనని చెప్పానని వెల్లడించింది. అయితే చాలా మంది అవకాశాల కోసం ఓకే చెబుతుంటారని.. కానీ టాలెంట్ లేకుండా అలా సెక్స్ కి ఒప్పుకుంటే మహా అయితే ఒక సినిమాలో ఛాన్స్ ఇస్తారని.. అన్ని సినిమాల్లో అవకాశాలు రావని అన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios