రౌడీ హీరో విజయ్ దేవరకొండ చివరగా నటించిన చిత్రం డియర్ కామ్రేడ్. విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన ఈ చిత్రం నిరాశపరిచింది. దీనితో తదుపరి చిత్రాల విషయంలో విజయ్ జాగ్రత్త పడుతున్నాడు. విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'వరల్డ్ ఫేమస్ లవర్'. క్రాంతి మాధవ్ దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. 

మరో ఎమోషనల్ లవ్ స్టోరీతో విజయ్ దేవరకొండ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తాజాగా చిత్ర యూనిట్ ఆసక్తికరమైన అప్డేట్ అందించింది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన నలుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. రాశి ఖన్నా, కేథరిన్, ఇజా బెల్లె, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

నలుగురు హీరోయిన్ల ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. డిసెంబర్ 12న ఐశ్వర్య రాజేష్, 13న ఇజా బెల్లె, 14న కేథరిన్, 15న రాశి ఖన్నా లుక్స్ కి సంబంధించిన పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అన్ని పోస్టర్స్ ని సాయంత్రం 6:03 గంటలకు విడుదల చేయనున్నారు. 

సాధారణంగానే విజయ్ దేవరకొండ చిత్రాలంటే హీరోయిన్లతో రొమాన్స్ ఘాటుగా ఉంటుంది. ఇక ఈ చిత్రంలో నలుగురు హీరోయిన్లు నటిస్తుండడం ఆసక్తిగా మారింది. విజయ్ దేవరకొండ సిగరెట్ కాల్చుతో రఫ్ గా ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. 

గోపిసుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కె ఏ వల్లభ, కెఎస్ రామారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత పూరి డైరెక్షన్ లో నటించేందుకు విజయ్ దేవరకొండ సిద్ధం అవుతున్నాడు. 

పునర్నవి భూపాలం.. బిగ్ బాస్ గ్లామర్ క్వీన్ లేటెస్ట్ ఫొటోస్!