రౌడీ హీరో విజయ్ దేవరకొండ మరో ప్రేమ కథా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు. విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది. ట్రైలర్ ఆకట్టుకోవడంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. 

ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన తొలిసారి నలుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. ఈ చిత్రంలో రాశి ఖన్నా, కేథరిన్, ఇజా బెల్లె, ఐశ్వర్యరాజేష్ లు విజయ్ దేవరకొండ తో రొమాన్స్ చేస్తున్నారు. క్రాంతి మాధవ్ దర్శత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కేఎస్ రామారావు నిర్మించారు. 

మత మార్పిడులే కారణమా.. విజయ్ ఐటీ రైడ్స్ పై విజయ్ సేతుపతి స్ట్రాంగ్ రిప్లై

ప్రస్తుతం విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్నాడు. ఓ ఇంటర్వ్యూలో విజయ్ తన మ్యారేజ్ ప్లాన్స్ గురించి మాట్లాడాడు. పెళ్ళెప్పుడు చేసుకుంటారు అని ప్రశ్నించగా.. పెళ్లి చేసుకునేందుకు తాను సిద్ధంగా లేనని విజయ్ తెలిపాడు. కెరీర్ గురించి మాత్రమే ఆలోచిస్తున్నానని అన్నాడు. 

వివాహబంధంపై నాకు గౌరవం ఉంది. కానీ నేను అందుకు సిద్ధంగా లేను. కెరీర్ లో ఇంకా ఎంతో సాధించాలని అనుకుంటున్నా అని విజయ్ దేవరకొండ తెలిపాడు. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి చిత్ర విజయాలతో విజయ్ దేవరకొండ టాలీవుడ్ లో క్రేజీ హీరోగా మారిపోయాడు.