త్వరలో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ...ఎన్నారై పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఫన్, చిన్నపాటి ఎమోషన్ తో సాగే ఈ పాత్రను చాలా ఇష్టపడి ఓకే చేసాడట. డియర్ కామ్రేడ్ తర్వాత కాస్త స్పీడు తగ్గించిన విజయ్ దేవరకొండ తన అప్ కమింగ్ ప్రాజెక్టుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కథ, కథనంలో వైవిధ్యం ఉంటేనే ఓకే చేస్తున్నారు.

మొదట్లో పెద్ద బ్యానర్ అయితే చాలు అనుకున్న విజయ్ దేవరకొండ ఇప్పుడు తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ ఏర్పడటంతో బ్యానర్ కన్నా కథలే ముద్దు అంటున్నాడట. ఇంతకీ విజయ్ దేవరకొండను ఎన్నారైగా చూపించే ఆ దర్శకుడు ఎవరూ అంటారా..అతను పేరు శ్రీహర్ష కోనుగంటి. ఎక్కడో పేరు విన్నట్లు ఉందా...

యస్ ..ఈ దర్శకుడు గతంలో   యూత్ ను టార్గెట్ చేసుకుని తెరకెక్కించిన చిత్రం 'హుషారు' .  యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా బీసీ సెంటర్లలో మంచి రెస్పాన్స్ తో బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్లను రాబట్టి  హిట్ సినిమాగా నిలిచింది.  ఈ నేపధ్యంలో  డైరెక్టర్ కి బాగానే అవకాశాలు వచ్చాయి. వాటిల్లో ఒకటి  'విజయ్ దేవరకొండ'తో సినిమా చేసే ఆఫర్. రీసెంట్ గా ఓ స్టోరీ లైన్ తీసుకుని వెళ్లి విజయ్ దేవరకొండకు వినిపించాడట.

ఓపెనింగ్ డే కలెక్షన్స్.. టాప్ లో మన తెలుగు సినిమాలే (2013-2019)!

ఈ  చిత్రం కథ  ఓ ఇంట్రస్టింగ్ స్టోరీ లైన్ తో రూపొందిదట.  ఫారెన్ లో పెరిగిన ఓ ఎన్నారై యువకుడు కొన్ని ప్రత్యేకమైన పరిస్దితుల్లో మారుమూల పల్లెటూరులో బతకాల్సి వస్తోందట. ఆ క్రమంలో హీరో ఎదురుకునే సమస్యలు, సంఘటనలు చుట్టు కథ తిరుగుతుందిట. విజయ్ దేవరకొండ ఈ స్టోరీ లైన్ వినగానే వెంటనే ఓకే చేసేసాడట. ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే చాలా సీన్స్ అదిరిపోతాయని చెప్తున్నారు.  

ప్రస్తుతం విజయ్ దేవరకొండ ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తో ఫైటర్ అనే సినిమాని, అదేవిధంగా దర్శకుడు క్రాంతి మాధవ్ తో వరల్డ్ ఫేమస్ లవర్  తో బిజీ బిజీగా వున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక శ్రీ హర్ష కోనుగంటి సినిమా మొదలవుతుందని సమాచారం. తన తొలి సినిమాతోనే సక్సెస్ కొట్టిన ఈ యంగ్ డైరెక్టర్ రెండో సినిమాతో కూడా సక్సెస్ కొట్టబోతున్నాడన్నమాట. విజయ్ దేవరకొండ తో సినిమా చేసేలోగా రౌడి బోయ్స్ టైటిల్ తో ఓ సినిమా ని పూర్తి చేస్తారని స