పబ్లిక్ ఈవెంట్ లో జారిన విజయ్ దేవరకొండ లుంగీ.. అలర్ట్ అయిన రాశి!
ఈ వేడుకకు యూనిట్ మొత్తం హాజరైంది. ఈ వేడుక కోసం విజయ్ స్పెషల్ గా రెడీ అయ్యాడు. తలపాగా, లుంగీ ధరించి ఈవెంట్ కి వచ్చాడు.
టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటించిన 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విజయ్ సరసన రాశిఖన్నా, క్యాథరిన్ త్రెసా, ఐశ్వర్యా రాజేష్, ఇసాబెల్లాలు నటించారు.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్రబృందం వైజాగ్ లో గ్రాండ్ గా ప్రీరుఇలీజ్ ఈవెంట్ ని నిర్వహించింది. ఈ వేడుకకు యూనిట్ మొత్తం హాజరైంది. ఈ వేడుక కోసం విజయ్ స్పెషల్ గా రెడీ అయ్యాడు. తలపాగా, లుంగీ ధరించి ఈవెంట్ కి వచ్చాడు.
వైజాగ్ లో ముద్దులు కురిపించిన విజయ్ దేవరకొండ.. గళ్ళ లుంగీ, తలపాగాతో రచ్చ!
మన హీరోలకు లుంగీ కొత్త కాకపోయినా.. విజయ్ కట్టు మాత్రం వెరైటీగా కనిపించింది. కలర్ కాంబినేషన్ ఆకట్టుకుంది. పైగా ఓ పబ్లిక్ ఈవెంట్ కి ఎప్పుడూ హీరోలు ఈ స్థాయిలో రెడీ అయి రాలేదు. విజయ్ డ్రెస్సింగ్ చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. వెరైటీగా ఉందని చాలా మంది అంటున్నారు.
ఇది ఇలా ఉండగా.. విజయ్ తనదైన స్టైల్ మాటలతో ఫ్యాన్స్ ని హుషారు పరుస్తుండగా.. సడెన్ గా లుంగీ జారిపోయింది. అది గమనించిన విజయ్ వెంటనే సర్దుకున్నాడు. ఆ సమయంలో పక్కనే ఉన్న రాశిఖన్నా.. సిగ్గు పడుతూ తనలో తనే నవ్వుకుంది.
లుంగీని గట్టిగా బిగించిన విజయ్.. రాశితో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చాడు. క్రాంతి మాధవ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను కెఎస్ రామారావు నిర్మించారు. గోపి సుందర్ సంగీతం అందించారు.