ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి టీనేజ్ నుంచి ఒక స్టార్ హీరోకి వీరాభిమాని అనే కథనాలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఒకానొక సమయంలో ఆ హీరో కోసం జగన్ స్పెషల్ పోస్టర్స్ లో తన ఫోటో వేయించుకునేవారిని అభిమాన సంఘాలకు నాయకుడిగా కూడా కొనసాగినట్లు టాక్ వచ్చింది.

అయితే జగన్ రాజకీయాల్లోకి వచ్చిన అనంతరం ఎక్కడా కూడా ఆ విషయంపై స్పందించలేదు.  కానీ ఇటీవల సినీ నటుడు విజయ్ చందర్ జగన్ అభిమాన నటుడి గురించి బయటపెట్టారు. నందమూరి బాలకృష్ణ అంటే వైఎస్ జగన్ కి చాలా ఇష్టమని ఆయన సినిమా విడుదలైతే ఫస్ట్ డే ఫస్ట్ షో చూడడానికి ఇష్టపడేవారని అన్నారు.

ఏపీ ఎఫ్‌డీసీ ఛైర్మెన్‌గా విజయ్ చందర్ నియామకం

"జగన్ సినిమా ఇండస్ట్రీలో ప్రతిఒక్కరితో స్నేహపుర్వకంగా ఉంటారు. హీరో సుమంత్ ఆయన కలిసే చదువుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందెలా జగ్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నారు" అని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ చందర్ మాట్లాడారు.

గతంలో బాలకృష్ణ వీరాభిమాని అంటూ సోషల్ మీడియాలో చాలా పోస్టర్లు వైరల్ అయ్యాయి. ఎలక్షన్స్ సమయంలో అయితే ఆ డోస్ కాస్త గట్టిగానే కనిపించింది. ఇక ఇప్పుడు ఈ సినియర్ నటుడు మరో క్లారిటీ ఇవ్వడంతో బాలయ్య అభిమానులు సంబరపడిపోతున్నారు. విజయ్ చందర్ ఇటీవల ఎపిఎఫ్ డిసి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు.