కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ బిగిల్ మూవీ నేడు వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా తెలుగులో కూడా (విజిల్) విజయ్ సినిమా విడుదల అవుతోంది. అయితే తమిళ్ లో సినిమాకు సంబందించిన ప్రమియర్స్ కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సారి విజయ్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా దర్శకుడు అట్లీ హీరో రేంజ్ ని దృష్టిలో ఉంచుకొని తెరకెక్కించిన సన్నివేశాలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. యాక్షన్ సీన్స్ అనే కాకుండా సినిమాలో ఎమోషన్స్ - డైలాగ్స్ అలాగే స్పోర్ట్స్ డ్రామా వంటి అంశాల్లో దర్శకుడు చాలా జాగ్రత్తగా అడుగులు వేసినట్లు అర్ధమవుతోంది. ఇక నయనతార పాత్ర కూడా సినిమాలో మరో హైలెట్ గా నిలిచింది. సినిమాలో ఫుట్ బాల్ కి సంబందించిన సీన్స్ అద్భుతంగా ఉన్నాయంటున్నారు.

ఇక బావోద్వేగమైన సన్నివేశాలతో విజయ్ మరోసారి ఫ్యాన్స్ హార్ట్ ని టచ్ చేసినట్లు చెబుతున్నారు. మొత్తానికి సినిమాతో విజయ్ మరో బిగ్ హిట్ అందుకోనున్నట్లు చెబుతున్నారు. మరి సినిమా తెలుగు ఆడియెన్స్ ని ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. మెయిన్ హైలెట్ పాయింట్స్ యాక్షన్ సీన్స్ సాంగ్స్ మేకింగ్ - విజయ్ డిఫరెంట్ రోల్స్. సినిమా కలెక్షన్స్ రావడానికి ఈ పాయింట్స్ చాలని చెబుతున్నారు.

Also read బిగిల్ షో వేయలేదని ఫ్యాన్స్ బీభత్సం.. 37 మంది అరెస్ట్