తమిళనాడులో అభిమానుల ఆగ్రహం మరోసారి కట్టలు తెచ్చుకుంటోంది.  బిగిల్ సినిమా విడుదల సందర్బంగా అభిమానులు నిన్నటి నుంచి సంబరాలు స్టార్ట్ చేశారు. అయితే చెప్పిన సమయానికి షోని ప్రదర్శించలేదని అభిమానులు ఆగ్రహంతో రోడ్లపై భీబత్సం సృష్టించారు. తమిళనాడు కృష్ణ గిరి జిల్లాలో జరిగిన ఈ ఘటన అందరిని షాక్ కి గురి చేసింది.

విజయ్ ఫ్యాన్స్ ని అదుపు చేయడానికి పోలీసులు చాలా సేపు కష్టపడ్డారు. బిగిల్ సినిమా షో వేయాలదని రచ్చ చేస్తూ పోలీస్ వాహనం మున్సిపల్ వాహనాలు ధ్వంసం చేశారు. అలాగే సినిమా హాల్ సమీపంలో ఉన్న షాపులకు వాహనాలకు నిప్పు పెట్టారు. వెంటనే పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. 37 మందిని అదుపులోకి తీసుకున్నారు.

ఇటీవల విజయ్ తన అభిమానులను కావాలని కొన్ని వివాదాల్లో ఇరికిస్తున్నారని ఆరోపించారు. అలాగే ఎవరో చేసిన తప్పులకు అభిమానులను లాగుతున్నారని కూడా ఇన్ డైరెక్ట్ గా అక్కడి నాయకులకు కౌంటర్ ఇచ్చారు. ఇక ఇప్పుడు అభిమానులకు సంబందించిన గొడవ మరోసారి భీబత్సం సృష్టించడంతో తమిళనాడులో హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంపై విజయ్ ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తిగా మారింది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన బిగిల్ సినిమా తెలుగులో విజిల్ గా విడుదలవుతోంది. ఇక సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.