కోలీవుడ్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ తరువాత మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్స్ లో విజయ్ ఒకరు. ఇది నిన్నటి వరకు. ఇప్పుడు కలెక్షన్స్ పరంగా తలైవా స్థానానికే విజయ్ ఎసరుపెట్టాడు. బిగిల్ సినిమా ఎవరు ఊహించని విధంగా 300కోట్లకు పైగా వసూళ్లతో తమిళ్ సినిమా స్థాయిని పెంచేసింది. తమిళ్ నాడులో అయితే రోజుకో రికార్డుతో విజయ్ సినిమా సెన్సేషన్ క్రియేట్ చెసింది.

అయితే నెక్స్ట్ సినిమా కూడా అదే స్థాయిలో సక్సెస్ సాధించాలని విజయ్ టార్గెట్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. విజయ్ నెక్స్ట్ లోకేష్ కనగరాజన్ దర్శకత్వంలో ఒక యాక్షన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో టాలెంటెడ్ యాక్టర్ విజయ్ సేతుపతి  ఒక ముఖ్య పాత్రలో నటిస్తుండడంతో ఆ సినిమాపై సౌత్ లో అంచనాలు భారీగా పెరిగాయి. అయితే ఆ ప్రాజెక్ట్ తో విజయ్ 400కోట్లకు టార్గెట్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. బిగిల్ కంటే ముందు సర్కార్ 250కోట్లను అందుకుంది.

దానికంటే ముందు వచ్చిన మెర్శల్ 200కోట్లను ఈజీగా అందుకుంది. ఇలా సినిమా సినిమాకు విజయ్ తన బాక్స్ ఆఫీస్ రేంజ్ ని పెంచుకుంటూ వెళుతున్నాడు.  ఫైనల్ గా నెక్స్ట్ సినిమాతో 400కోట్ల వరకు బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవాలని ఫిక్స్ అయ్యాడట. అందుకే సినిమాకు సంబందించిన ప్రతి విషయంలో విజయ్ ప్రత్యేకంగా చర్చలు జరుపుతున్నాడు,.

ఏపీ ఎఫ్‌డీసీ ఛైర్మెన్‌గా విజయ్ చందర్ నియామకం

విజయ్ సేతుపతి లాంటి యాక్టర్ కూడా ప్రాజెక్ట్ లో నటిస్తుండడంతో \ప్రాజెక్టుకి సౌత్ లో మంచి మార్కెట్ ఏర్పడింది. సినిమా రిలీజ్ అయ్యాక టాక్ తో సంబంధం లేకుండా ఈజీగా 200కోట్లవరకు వసూలు చేయగలదని చిత్ర యూనిట్ నమ్మకంతో ఉంది. విజయ్ మాత్రం మరో మైలురాయిని అందుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. మరి ఆ సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.