సౌత్ లో హైయెస్ట్ పైడ్ యాక్ట్రెస్ నయనతార. వయసు పెరిగేకొద్దీ నయనతార గ్లామర్ కూడా పెరుగుతోంది. క్రేజ్ అంతకంతకు పెరుగుతోంది. దీనితో కోట్లిచ్చి మరీ నయన్ ని తమ చిత్రాల్లో నటింపజేసుకుంటున్నారు. ఇక నయనతార ప్రేమ వ్యవహారాలతో ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. 

గతంలో నయనతార శింబు, ప్రభుదేవా లతో లోతైన ప్రేమలో మునిగితేలింది. ఆ తర్వాత వారిద్దరి నుంచి విడిపోయింది. ప్రస్తుతం యువ దర్శకుడు విఘ్నేష్ శివన్ తో నయనతార సహజీవనం చేస్తోంది. నయనతార, విఘ్నేష్ మధ్య కూడా బ్రేకప్ జరిగిందని ఇటీవల వార్తలు వచ్చాయి. 

దిల్ రాజు పెళ్ళికి ఆ ఇద్దరూ హాజరు.. నిజామా ?

ఆ వార్తలని విఘ్నేష్ శివన్ ఒక్క పోస్ట్ తో పటాపంచలు చేశాడు. మాతృ దినోత్సవం సందర్భంగా నయనతార పిక్ ని విఘ్నేష్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశాడు. ఆ ఫొటోలో నయన్ ముద్దొచ్చే ఓ ఫారెన్ బుడతడిని ఎత్తుకుని ఉంది. ఈ ఫోటోపై విఘ్నేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

 

నా పిల్లలకు భవిష్యత్తులో కాబోయే తల్లి అని నయన్ పై కామెంట్ చేశాడు. భవిషత్తులో నా పిల్లలకు కాబోయే తల్లి చేతుల్లో ఉన్న పిల్లాడి తల్లికి మదర్స్ డే శుభాకాంక్షలు అని విగ్నేష్ పోస్ట్ పెట్టాడు. ఇంతవరకు పెళ్లి కాలేదు కానీ అప్పుడే విఘ్నేష్ నయన్ తో పిల్లల వరకు వెళ్ళిపోయాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.