ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు పెళ్లి గురించే చర్చ జరుగుతోంది. ఆదివారం రోజు రాత్రి 11 గంటలకు దిల్ రాజు ద్వితీయ వివాహం చేసుకున్నారు. వధువు పేరు తేజస్విని. ఆస్ట్రాలజీ ప్రకారం పెళ్లి కోసం ఆమె పేరుని వైగా రెడ్డిగా మార్చినట్లు తెలుస్తోంది. 

కొద్దిమంది బంధువుల సమక్షంలోనే దిల్ రాజు, తేజస్విని వివాహం జరిగింది. నిజామాబాద్ లోని నర్సింగ్ పల్లి శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో వీరి వివాహం జరిగింది. చిత్ర పరిశ్రమ నుంచి ఎవరూ ఈ పెళ్ళికి హాజరు కాలేదు. 

దిల్ రాజు పెళ్లి ఫోటోలు.. ఆయన భార్యని చూశారా!!

కానీ జరుగుతున్న ప్రచారం ప్రకారం దిల్ రాజుతో సన్నిహితంగా ఉండే హరీష్ శంకర్, అనిల్ రావిపూడి హాజరైనట్లు టాక్. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. ఈ ఇద్దరు దర్శకులు దిల్ రాజు నిర్మాణంలో సినిమాలు చేశారు. 

సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం దిల్ రాజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కరోనా ప్రభావం తగ్గాక ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.