సినిమా ఇండస్ట్రీలోలో ఎఫైర్లు, రూమర్లు చాలా కామన్. కొన్ని ప్రేమ కథలు పెళ్లి వరకు వెళ్తే.. మరికొన్నిమధ్యలోనే తెగిపోయాయి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ కి కూడా గతంలో కొన్ని ఎఫైర్లు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్ లాంటి వాళ్లతో కత్రినా డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి.

రణబీర్ తో తనది బ్యాడ్ బ్రేకప్ అంటూ కత్రినా నేరుగా పలు సార్లు చెప్పింది. ఇప్పుడు ఈ బ్యూటీ మరో హీరోతో ఎఫైర్ పెట్టుకుందంటూ బాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. అతడు మరెవరో కాదు.. విక్కీ కౌశల్. 'రాజీ', 'సంజు', 'ఉరి' వంటి చిత్రాల్లో నటించిన విక్కీ కౌశల్ కి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది.

కత్రినా డేటింగ్.. గాసిప్స్ డోస్ పెంచిన బాలీవుడ్?

ముఖ్యంగా అతడికి అమ్మాయిల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఎక్కువ. అయితే చాలా కాలంగా విక్కీ.. కత్రినాతో డేటింగ్ చేస్తున్నాడని బాలీవుడ్ వర్గాల సమాచారం. దీపావళి సెలబ్రేషన్స్ సమయంలో ఇద్దరూ కలిసి కనిపించడం హాట్ టాపిక్ అయింది. తాజాగా మరోసారి ఈ జంట కలిసి కనిపించడం వార్తల్లో నిలిచింది.

రాత్రివేళ అత్యంత రహస్యంగా కత్రినా కైఫ్, విక్కీకౌశల్ లు వేర్వేరు కార్లలో ముంబైలోని ఓ స్నేహితుడి ఇంటికి వచ్చి కలిశారని సమాచారం. కత్రినా, విక్కీలు మంగళవారం రాత్రి వేర్వేరుగా కార్లలో వచ్చిన ఫోటోలను ఓ ఫోటోగ్రాఫర్ క్లిక్ మనిపించారు.

ఆ ఫోటోలు కాస్తా మీడియాలో రావడంతో వీరి డేటింగ్ విషయం బయటకొచ్చింది. అయితే అటు కత్రినా కానీ ఇటు విక్కీ కానీ ఈ వార్తలపై క్లారిటీ ఇవ్వడం లేదు.