బాలీవుడ్ లో కత్రినా కైప్ గురించి నిత్యం ఎదో ఒక న్యూస్ వైరల్ అవ్వడం కామన్. ఆమె డేటింగ్ కి సంబందించిన న్యూస్ ఎదో ఒకటి వైరల్ అవుతూనే ఉంటుంది. అయితే ఈ మధ్య ముంబై మీడియాలో ఆ డోస్ కాస్త పెరిగిందనే చెప్పాలి. సల్మాన్ ఖాన్ నుంచి రణ్ బీర్ కపూర్ వరకు అమ్మడు ఓపెన్ గానే డేటింగ్ చేసింది.

ముఖ్యంగా రణ్ బీర్ తో డేటింగ్ లో ఉన్నట్లు మీడియా కు సమాధానం కూడా ఇచ్చింది.  ఇకపోతే అమ్మడు ప్రస్తుతం డేటింగ్ విషయాన్నీ చాలా సీక్రెట్ గా మెయింటైన్ చేస్తున్నట్లు టాక్ వస్తోంది. కొంగుచుట్టు ఓ కొత్త బాయ్ ఫ్రెండ్ ని తిప్పుకుంటున్నట్లు ఇటీవల రూమర్స్ ఓ రేంజ్ లో వచ్చాయి. అతనెవరో కాదు. యూరి హీరో విక్కీ కౌశల్.  గత కొన్నాళ్లుగా కత్రినా చుట్టూ తిరుగుతుండడంతో ఆమెతో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.

read also: తెలుగు కమెడియన్స్ రెమ్యునరేషన్స్.. రోజుకి ఎంతంటే?

అయితే ఆ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చినప్పటికీ డోస్ తగ్గలేదు.  ఈ మధ్య ఓ రెస్టారెంట్ కి వెళ్లిన ఈ ఇద్దరు అక్కడ ఒక వ్యక్తితో ఫోటో దిగారు. చాలా రోజుల తరువాత కత్రినా విక్కీ ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో మరోసారి నార్త్ మీడియాలో లవ్ గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈ కథనాలపై యువ జంట ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

#VickyKaushal #KatrinaKaif

A post shared by Entertainment Fan Page (@facc2911) on Nov 13, 2019 at 10:34am PST

ఇక కత్రినా ప్రస్తుతం అక్షయ్ కుమార్ సూర్యవన్షి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బేబీ చివరగా సల్మాన్ ఖాన్ తో భరత్ సినిమా చేసింది. ఆ సినిమా స్ట్రాంగ్ ఓపెనింగ్స్ అందుకున్నప్పటికీ అందుకున్నంతగా విజయం సాధించలేకపోయింది. ఇక విక్కీ కౌశల్ యూరి సినిమా అనంతరం బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకున్నాడు/ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు.