బాలీవుడ్ ప్రముఖ నటుడు రంజిత్ దాదాపు 200పైగా చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం అయన వయసు 80కి దగ్గర పడుతోంది. ఈ వయసులో కూడా ఆయన ఎంతో హుషారుగా ఉన్నారు. తాజాగా రంజిత్ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో వైరల్ గా మారింది. 

రంజీత్ జిమ్ లో తన కుమార్తెతో కలసి డాన్స్ చేసిన వీడియో నెటిజన్లని ఆకట్టుకుంటోంది. ' నా వయసు 80కి దగ్గర పడుతోంది.. నేను ఇలా డాన్స్ చేస్తున్నానంటే అందుకు కారణం కేవలం నా కుమార్తె మాత్రమే అని రంజిత్ పేర్కొన్నారు. 

'బంగారం' హీరోయిన్ ఒక B****, రాత్రికి నీ రేటెంత.. దారుణంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్, పోలీసులకు ఫిర్యాదు

తండ్రి కూతుళ్ళ డాన్స్ వీడియో చాలా ఫన్నీగా ఉంది. ఈ వీడియోకు బాలీవుడ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్ ఫిదా అయ్యారు. అమేజింగ్ అంకుల్ అని కామెంట్ పెట్టాడు. 

నటుడు రంజిత్ అలనాటి బాలీవుడ్ చిత్రాల్లో తిరుగులేని విలన్. ఆయన డైలాగ్ డెలివరీ అభిమానులని బాగా ఆకట్టుకుంటుంది. రంజిత్ చివరగా అక్షయ్ కుమార్ హౌస్ ఫుల్ 4 లో నటించారు. రంజిత్ అమృత్ సర్ లో జన్మించారు. గోపాల్ బేడీ అనేది ఆయన అసలు పేరు. సినిమాల్లోకి వచ్చాక రంజిత్ అని మార్చుకున్నారు.