క్రాంతిమాధవ్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’. రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, ఇజబెల్లా, కేథరిన్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం రిలీజ్ కు రెడీ అయ్యింది. దాంతో  ప్రమోషన్స్ అఫీషియల్ గా  ప్రారంభమయ్యాయి. హీరోయిన్ ఐశ్వర్వా రాజేష్ ఇంటర్వూలు ప్రారంభించింది.

రిలీజ్ చూస్తే మరో రెండు వారాలే ఉంది. అయితే ఇప్పటిదాకా ఈ ప్రాజెక్టుకు కొద్దిగా కూడా క్రేజ్ రాలేదు. సాధారణంగా విజయ్ సినిమాలు రిలీజ్ కు ముందు ఓ రేంజి బజ్ తో ఓపినింగ్స్ కు సిద్దం గా ఉంటాయి. అలాంటి పరిస్దితి ఈ సారి మచ్చుకైనా కనపడటం లేదు. ఎక్కడ తప్పు దొర్లిందా అని నిర్మాత, దర్శకులతో కంటే ఎక్కువగా విజయ్ దేవరకొండ టెన్షన్ పడుతున్నారట.

రీసెంట్ గా వచ్చిన విజయ్ దేవరకొండ చిత్రం  'డియర్ కామ్రేడ్' డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడం, కొత్త డైరెక్టర్‌తో మొదలుపెట్టిన 'హీరో' సినిమా సరిగా రాక దాన్ని మధ్యలో ఆపెయ్యడం లాంటి పరిణామాలు, ఈ సినిమాపై ఇంట్రస్ట్ క్రియేట్ చేయలేకపోయాయని చెప్తున్నారు. దాంతో ఇప్పుడు ఓపెనింగ్స్ కూడా ఆ కొత్త సినిమాకు వస్తాయో రావో అర్దం కాని సిట్యువేషన్ లో ఉన్నారు.

'అశ్వద్థామ' ఫస్ట్ డే కలెక్షన్స్..!

ఈ చిత్రంలో నలుగురు హీరోయిన్లు ఉన్నారు. రాశీ ఖన్నా మెయిన్ హీరోయిన్ కాగా.. కేథరిన్ థ్రెసా, ఐశ్వర్యా రాజేష్, ఎజిబెల్లా మరో ముగ్గురు హీరోయిన్లు. ఇలా నలుగురు హీరోయిన్ల చుట్టూ తిరగే కథ కాబట్టి దీనికి ఈ టైటిల్ పెట్టారని తెలుస్తోంది. డియర్ కామ్రేడ్ ఫ్లాప్ కావడంతో ఈ చిత్రం విజయ్ కెరీర్‌కు కీలకంగా మారింది. మళ్ళీ మళ్లీ ఇది రానిరోజు సినిమా తర్వాత సరైన సక్సస్  లేని క్రాంతి మాధవ్.. ఈ సినిమాతో ఫామ్‌లోకి రావాలని చూస్తున్నాడు.

కేయస్‌ రామారావు సమర్పణలో కేయస్‌ వల్లభ నిర్మిస్తున్న ఈ చిత్రం  ప్రేమికుల రోజున (ఫిబ్రవరి 14) రిలీజ్‌ చేస్తున్నారు. ఇందులో విజయ్‌ దేవరకొండ విభిన్నమైన లుక్స్‌తో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్‌.