నటుడిగా, నిర్మాతగా తన సత్తా చాటుతున్న యువ హీరో నాగశౌర్య తాజాగా తన సినిమా కోసం సొంతంగా కథ రాసుకున్నాడు. ముంబైలో తన స్నేహితుడి సోదరికి ఎదురైన అనుభవాన్ని కథలా రాసుకున్నానని చెప్పాడు. అదే 'అశ్వద్థామ'. శుక్రవారం నాడు ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

సమాజంలో ఆడవాళ్లపై ఎంతటి ఘోరమైన సంఘటనలు జరుగుతున్నాయో.. ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వస్తోంది. తొలిరోజు కలెక్షన్స్ విషయానికొస్తే మాత్రం నాగశౌర్య మంచి ఓపెనింగ్స్ రాబట్టాడనే చెప్పాలి.

ఏం అల్లు అరవిందేనా...నేను చెయ్యలేనా..?

పదికోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా ఏపీ, తెలంగాణాలో మొదటిరోజు రూ.4 కోట్లు రాబట్టినట్లు సమాచారం. అమెరికాలో రూ.35 లక్షలు రాబట్టినట్లు తెలుస్తోంది. ఓవర్సీస్ లో రూ.75 లక్షలు వసూళ్లు రాబట్టినట్లు చిత్ర వర్గాల సమాచారం.

మొత్తానికి ఈ సినిమా తొలిరోజు ఐదు కోట్లు రాబట్టినట్లు సినీ విశ్లేషకులు చెబుతున్నారు. తన కెరీర్ లో ఇదే బెస్ట్ సినిమా అని.. ఏ సినిమాకి కూడా ఇంతటి ఓపెనింగ్స్ ఎప్పుడూ రాలేదని చెబుతున్నారు. మెహ్రీన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి రమణతేజ దర్శకత్వం వహించారు.