టాలీవుడ్ లో ఈ తరం కమెడియన్లలో వెన్నెల కిషోర్ ఒకరు. వెన్నెల కిషోర్ టాలీవుడ్ స్టార్ కమెడియన్ క్రమంగా తన క్రేజ్ పెంచుకుంటున్నాడు. కేవలం హావభావాలతో నవ్వులు పూయించడం గతంలో బ్రహ్మానందంకు మాత్రమే సాధ్యమయ్యేది.  ఇప్పుడు వెన్నెల కిషోర్ కామెడీ పంచ్ లతో మాత్రమే కాదు, హావ భావాలతో కూడా హాస్యం పండిస్తున్నాడు. 

టాలీవుడ్ దర్శక నిర్మాతలకు వెన్నెల కిషోర్ ప్రస్తుతం మోస్ట్ వాంటెండ్ కమెడియన్. లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన ఈ క్రేజీ కెమెడియన్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. చేతినిండా చిత్రాలతో ప్రస్తుతం తాను బిజీగా ఉన్నట్లు వెన్నెల కిషోర్ తెలిపాడు. 

బోల్డ్ షోకి ప్రతిఫలం.. అల్లు అర్జున్ 'పుష్ప'లో శృంగార తార

అఖిల్ నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, నితిన్ రంగ్ దే, అల్లు అర్జున్ పుష్ప చిత్రాలతో పాటు మెగాస్టార్ చిరంజీవి ఆచార్య చిత్రంలో కూడా తాను నటిస్తున్నట్లు వెన్నెల కిషోర్ తెలిపాడు. ఆచార్య చిత్రం కోసం తాను చాలా ఆసక్తిగా ఉన్నానని.. ఇప్పటికే వారం రోజుల షూటింగ్ లో పాల్గొన్నాని కిషోర్ తెలిపాడు. మెగాస్టార్ చిరంజీవి దుమ్ము దులిపేస్తున్నారని కిషోర్ తెలిపాడు. 

తనకు కామెడీ రోల్స్ తో పాటు నెగిటివ్ రోల్స్ చేయడం అంటే కూడా ఇష్టం అని వెన్నెల కిషోర్ తెలిపాడు. కానీ కమెడియన్ గా గుర్తింపు పొందాక ఇతర పాత్రల్లో నటించడం కష్టం. కానీ భవిష్యత్తులో నెగిటివ్ రోల్స్ చేసే ప్రయత్నం చేస్తానని వెన్నెల కిషోర్ తెలిపాడు.