సినిమా ఇండస్ట్రీలో వచ్చిన సక్సెస్ ని నిలబెట్టుకోవడం అంత ఈజీ కాదు. ఒకసారి సక్సెస్ వచ్చింది కదా అని రిలాక్స్ అయిపోతే ఇండస్ట్రీలో ఎక్కువ రోజులు కొనసాగలేరు. గతేడాది 'ఆర్ ఎక్స్ 100' లాంటి సెన్సేషనల్ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన పాయల్ కి ఆ సినిమా మంచి పేరు తీసుకొచ్చింది.

ఈ సినిమాతో వచ్చిన గుర్తింపుతో అమ్మడుకిఅవకాశాలు బాగానే వచ్చాయి కానీ ఎలాంటి కథలు ఎన్నుకోవాలో తెలియక పాయల్ కొన్ని మిస్టేక్స్ చేసింది. 'సీత' సినిమాలో ఐటెం సాంగ్ చేస్తే దాని వల్ల ఫలితం లేకపోయింది. 'ఆర్డీ ఎక్స్ లవ్' సినిమా చేస్తే దాని వల్ల పెద్ద నష్టం వచ్చింది.

విజయ్ దేవరకొండ క్రేజ్.. అలియా కూడా ఫ్యాన్ అయిపోయింది!

ఈ సినిమాలో పాయల్ బోల్డ్ డైలాగ్స్, బోల్డ్ అవతారం ఆమెకి చెడ్డ పేరు తీసుకొచ్చింది. అది ఏ రేంజ్ లో అంటే కాస్త పేరున్న హీరోలు  తమ సినిమాలో పాయల్ ని పెట్టుకోవాలంటే ఆలోచించే పరిస్థితి కలుగుతోంది. 'ఆర్డీఎక్స్ లవ్' రిలీజ్ కి ముందే పాయల్ కి 'వెంకీ మామ' సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది.

కానీ 'ఆర్డీఎక్స్ లవ్' సినిమా కారణంగా పాయల్ పై పడ్డ మార్క్ తమ సినిమాకి ఎక్కడ చేటు చేస్తుందోనని.. సినిమా ప్రమోషన్స్ లో పాయల్ ని హైలైట్ కాకుండా జాగ్రత్త పడుతున్నారు. తాజాగా ఈ సినిమా ప్రెస్ మీట్ నిర్వహిస్తే అందులో ఎక్కడా పాయల్ కనిపించలేదు.

ఈవెంట్ కి రాలేనంత బిజీగా అయితే ఆమె లేదు. తన సినిమా ప్రమోషన్స్ అంటే పాయల్ చాలా యాక్టివ్ గా పాల్గొంటూ ఉంటుంది. అలాంటిది ఆమె 'వెంకీ మామ' ఈవెంట్ లో కనిపించకపోవడానికి కారణాలేంటో తెలియరాలేదు. చిత్రబృందం కావాలనే ఆమెని పక్కన పెట్టిందా అనే సందేహాలు కలుగుతున్నాయి. సినిమాలో ఆమె క్యారెక్టర్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండదని అంటున్నారు.