టాలీవుడ్ లో అతి తక్కువ సమయంలో సెన్సేషనల్ హీరోగా మారిపోయాడు విజయ్ దేవరకొండ. అతడికి సెపరేట్ ఫ్యాన్ బేస్ తయారైంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్నాడు. తెలుగు సెలబ్రిటీలను పెద్దగా పట్టించుకోని బాలీవుడ్ కూడా విజయ్ దేవరకొండ గురించి గొప్పగా మాట్లాడడం విశేషం.

గతంలో ఓ ఇంటర్వ్యూలో దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్.. విజయ్ దేవరకొండ నటన అంటే తనకు ఇష్టమని ఒకరోజు మగాడిలా ఉండాలనుకుంటే అతడిలా మారతానని 
చెప్పుకొచ్చింది. 'అర్జున్ రెడ్డి' రీమేక్ 'కబీర్ సింగ్'తో బాలీవుడ్ లో క్రేజ్ తెచ్చుకున్న కియారా అద్వానీ సైతం విజయ్ పట్ల తనకున్న అభిమానాన్ని ఓ సందర్భంలో బయటపెట్టింది.

ప్రియాంక, దీపికా పదుకొనె వద్దు.. రష్మినే కావాలంటున్న సుడిగాలి సుధీర్!

తాజాగా అలియా భట్ విజయ్ మీద తనకున్న ఇంప్రెషన్ ఏంటో చెప్పింది. ఓ ఫ్యాషన్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న అలియా.. ఈ ఏడాదికి స్టైల్ పరంగా మీకు బాగా నచ్చిన నటీనటులు ఎవరని ఓ విలేకరి ప్రశ్నించగా... హీరోయిన్లలో అనుష్క శర్మ ఎప్పటికీ తన ఫేవరేట్ అని చెప్పిన అలియా.. హీరోలలో విజయ్ దేవరకొండ పేరు చెప్పింది.

విజయ్ స్టైల్ అధ్బుతంగా ఉంటుందని అలియా చెప్పుకొచ్చింది. దీన్ని బట్టి తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర భాషల్లో కూడా విజయ్ కి మంచి క్రేజ్ ఉందని తెలుస్తోంది. సినిమాలతో పాటు ఫ్యాషన్ లో కూడా తనదైన ముద్ర వేసుకున్న విజయ్ దేవరకొండ ఈ ఏడాది 'డియర్ కామ్రేడ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ప్రస్తుతం ఈ హీరో 'వరల్డ్ ఫేమస్ లవర్' అనే సినిమాలో నటిస్తున్నాడు. దీంతో పాటు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.