యంగ్ హీరో నితిన్ నటించిన తాజా చిత్రం భీష్మ మూవీ మంచి విజయం సాధించింది. పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రంగా తెరకెక్కిన భీష్మ ప్రేక్షకులని మెప్పించింది. నితిన్ రష్మిక మందన జంటగా నటించారు. ఛలో చిత్రంతో విజయాన్ని అందుకున్న వెంకీ కుడుముల బీష్మాతో వరుసగా రెండో హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. 

భీష్మ చిత్రంలో వెంకీ కుడుముల సేంద్రియ వ్యవసాయం అనే సీరియస్ పాయింట్ గురించి చెబుతూనే వినోదాన్ని ఎక్కడా తగ్గించలేదు. దీనితో ఈ చిత్రం మంచి విజయం సాధించింది. పలువురు సినీ ప్రముఖులు ఇప్పటికే భీష్మ చిత్రాన్ని ప్రశంసించారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి భీష్మ చిత్ర యూనిట్ ని అభినందించారు. 

స్వయంగా చిరంజీవి వెంకీ కుడుములతో కలసి భీష్మ చిత్రాన్ని వీక్షించారు. అనంతరం తమని అభినందించినట్లు వెంకీ కుడుముల సోషల్ మీడియాలో తెలిపారు. ఇటీవల చిరంజీవి యువ దర్శకులని ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే. చిన్న సినిమా, పెద్ద సినిమా అని తేడా లేకుండా చిరు తన వద్దకు వచ్చిన వారందరిని అభినందిస్తున్నారు. 

నేను చిత్ర పరిశ్రమలోకి రావడానికి ఇన్సిపిరేషన్ గా నిలిచిన చిరంజీవి గారు నాతో కలసి భీష్మ చిత్రం చూడడం కలలా ఉంది. మా చిత్రాన్ని చూసినందుకు చిరంజీవిసర్ కి ధన్యవాదాలు అంటూ మెగాస్టార్ తో ఉన్న ఫోటోలని వెంకీ కుడుముల షేర్ చేశాడు. ఓ పిక్ లో వెంకీ కుడుముల చిరంజీవికి షేక్ హ్యాండ్ ఇస్తూ కనిపిస్తున్నాడు. 

మెగాస్టార్ సినిమాలో స్టార్ హీరోయిన్.. ఫ్యాన్స్ హ్యాపీ!

చిరుకి షేక్ హ్యాండ్ ఇవ్వడంపై వెంకీ కుడుముల ఓ సీరియస్ పాయింట్ చెప్పాడు. నోట్: ఈ ఫోటోలో చిరంజీవి గారికి షేక్ హ్యాండ్ ఇచ్చింది శానిటైజర్ వాడిన తర్వాతే.. అందరూ సేఫ్టీ ప్రికాషన్స్ ఫాలో కండి.. సేఫ్ గా ఉండండి అని వెంకీ కుడుముల తెలిపాడు, కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు శానిటైజర్ లు ఉపయోగించడంపై మొగ్గు చూపుతున్నారు. ఈ సీరియస్ విషయాన్ని వెంకీ చెబుతున్నప్పటికీ జోకులు వేస్తున్నట్లుగానే అనిపిస్తోంది.. వెంకీ సినిమాల్లో సెటైర్లు కూడా ఇలాగే ఉంటాయి మరి.