మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ బిగ్ బడ్జెట్ సినిమాతో సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. ఆచార్య అనే టైటిల్ కూడా సెట్టయ్యింది. సైరా సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాకపోవడంతో ఈ సినిమాతో సినిమాతో ఎలాగైనా ఇండస్ట్రీ హిట్ అందుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఓ వైపు రామ్ చరణ్ కూడా తండ్రి 152వ సినిమా కోసం జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

అయితే హీరోయిన్ విషయంలో మాత్రం పెద్ద కన్ఫ్యూజన్ నెలకొంది. మెయిన్ హీరోయిన్ కోసం త్రిష ను సంప్రదించినట్లు అనేక రకాల వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే రీసెంట్ గా ఆమె తప్పుకోవడంతో మరొక స్టార్ హీరోయిన్ ని సెట్ చేసినట్లు తెలుస్తోంది. మొదట త్రిష అనగానే అభిమానులు కాస్త నీరాశచెందారనే చెప్పాలి. ఇక ఇప్పుడు అనుష్క ని సెలెక్ట్ చేసుకోవడంతో ఆడియెన్స్ లో జోష్ పెరిగింది.

మెగాస్టార్ కి అనుష్క కరెక్ట్ గా సెట్టవుతుందని అంతా భావిస్తున్నారు. ఇంతవరకు అనుష్క మెగా హీరోలతో ఫుల్ లెన్త్ రోల్ లో నటించింది లేదు. గతంలో స్టాలిన్ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో మెరిసిన అమ్మడు ఆ తరువాత సైరా సినిమాలో ఝాన్సీ లక్ష్మి భాయి గా కొద్దీ సేపే నటించింది. ఇక ఇన్నాళ్లకు మెగాస్టార్ కి జోడిగా మెయిన్ హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుంది. మరీ వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఎంతవరకు క్లిక్కవుతుందో చూడాలి.