విక్టరీ వెంకటేష్.. అన్ని జనరేషన్స్ వాళ్ళు అభిమానించే హీరో. వెంకటేష్ సినిమా రిలీజవుతుందంటే ఫ్యామిలీ ఆడియన్స్ కు పెద్ద పండగే. యాక్షన్, ఎమోషన్ మాత్రమే కాలేదు..కామెడీ పండించడంలో కూడా వెంకీకి తిరుగులేదు. వెంకటేష్ చివరగా వెంకీ మామ చిత్రంలో నటించాడు. ప్రస్తుతం నారప్ప చిత్రంలో నటిస్తున్నాడు. 

వెంకటేష్ నటించిన 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' చిత్రం 2007లో ఏప్రిల్ 27న విడుదలైంది. సోమవారానికి ఈ చిత్రాన్ని విడుదలై 13 ఏళ్ళు పూర్తయింది. ఈ సందర్భంగా వెంకటేష్ ఆ చిత్రాన్ని గుర్తుచేసుకున్నారు. ట్విట్టర్ వేదికగా వెంకీ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.  

స్టార్ హీరో అభిమానులని దుమ్మెత్తిపోసిన హీరోయిన్.. ట్వీట్ డిలీట్

ఆడవారి మాటలకు అర్థాలే వేరులే చిత్రంలో ఉన్న విభిన్నమైన ఎమోషన్స్ నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా కోట శ్రీనివాసరావుతో ఉన్న సీన్స్ నాకు చాలా ఇష్టం. ఈ చిత్రం అద్భుతమైన విజయం సాధించింది. నాకు కూడా ఈ చిత్రంతో ప్రశంసలు దక్కాయి. 

ఈ చిత్ర దర్శకుడు సెల్వరాఘవన్ కు కృతజ్ఞతలు, త్రిష అద్భుతమైన కోస్టార్ అని వెంకీ ట్వీట్ చేశాడు. మీ లాంటి లెజెండ్ తో పనిచేయడం నా అదృష్టం అని దర్శకుడు సెల్వరాఘవన్ ట్వీట్ చేశారు. వెంకటేష్ ట్వీట్ చేస్తూ.. కోట శ్రీనివాసరావుతో అవునయ్యా కొంపే మునిగింది అంటూ డైలాగ్ చెప్పే సన్నివేశాన్ని షేర్ చేయడం విశేషం.