తన హాట్ అందాలతో యువతని ఆకర్షిస్తోంది మాళవిక మోహన్. మాళవిక ఫిల్మీ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చింది. ప్రముఖ సినిమా ట్రోగ్రాఫర్ కెయు మోహనన్ ఆమె తండ్రి. దీనితో చిత్ర పరిశ్రమలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో మాళవికకు తెలుసు. 

ఇదిలా ఉండగా మాళవిక గ్లామర్ ఆరబోతలో ఎలాంటి కండిషన్స్ పెట్టుకోదు. అవసరమైన మేరకు వెండితెరపై గ్లామర్ గా కనిపించేందుకు ప్రయత్నిస్తోంది. గ్లామర్ ఫీల్డ్ లో గ్లామర్ తోనే నెట్టుకురావాలనే సూత్రాన్ని మాళవిక పాటిస్తోంది. సోషల్ మీడియాలో మాళవిక అందాల ఆరబోత చూస్తే కుర్రాళ్ళు పిచ్చెక్కి పోవలసిందే. 

ప్రస్తుతం మాళవిక తమిళ స్టార్ హీరో విజయ్ సరసన మాస్టర్ చిత్రంలో నటిస్తోంది. దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కరోనా ప్రభావం తగ్గాక విడుదలకానుంది. విజయ్ అభిమానులు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటారు. ప్రస్తుతం లాక్ డౌన్ సందర్భంగా మాస్టర్ మూవీ టీం ఎం చేస్తూ ఉంటుంది అనే ఆలోచనకు విజయ్ ఫ్యాన్స్ తమ క్రియేటివిటీకి పదును పెట్టారు. 

ఈ నేపథ్యంలో విజయ్ అభిమానులు కొందరు ఓ కార్టూన్ రెడీ చేసారు. మూవీ టీం ఎవరి పనుల్లో వారు ఉంటారు. మాళవిక మోహన్ మాత్రం వారందరికీ వంటలు వండుతున్నట్లు కార్టూన్ లో ఉంది. ఈ కార్టూన్ మాళవికకు ఆగ్రహం తెప్పించింది. 

హైపోథిటికల్ మూవీ హౌస్ లో కూడా ఆడవారి పని వంట వండడమేనా.. ఈ లింగ బేధం ఎప్పుడు అంతం అవుతుంది.. సెక్సిస్టు ట్వీట్ అంటూ మాళవిక ట్వీట్ చేసింది. ఇంత చిన్న విషయం గురించి అంత రచ్చ ఎందుకు అంటూ విజయ్ అభిమానులు మాళవికని తిరిగి ట్రోల్ చేయడం ప్రారంభించారు. దీనితో మాళవిక ఆ ట్వీట్స్ ని వెంటనే డిలీట్ చేసింది.