వెంకటేష్ - నాగ చైతన్య కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం వెంకీ మామ ఎప్పుడొస్తుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సినిమా పై గ్లింప్స్ లతో మంచి హైప్ క్రియేట్ చేస్తున్నారు గాని సినిమా ఎప్పుడు వస్తుందో క్లారిటీ ఇవ్వడం లేదు. ఇక మరో గ్లింప్స్ ని నేడు రిలీజ్ చేశారు.  నాగ చైతన్య పుట్టినరోజు సందర్బంగా అల్లుడి బర్త్ డే గ్లింప్స్ అంటూ రిలీజ్ చేసిన టీజర్ ఆడియెన్స్ ని ఆకట్టుకుంటోంది.

హీరోల ఫస్ట్ రెమ్యునరేషన్,. ఇప్పుడేంత? (రూ.400 నుంచి 30కోట్లవరకు)

మా అల్లుడి లవ్ టైటానిక్ రేంజ్ లో ఉంటుందనుకున్నా.. కానీ పడవ రేంజ్ లో కూడా లేదు అని వెంకటేష్ చెప్పిన డైలాగ్ బావుంది. ఇక సినిమాలో చైతూ పారా కమాండర్ సోల్జర్ గా కనిపించబోతున్నాడు. యాక్షన్ డోస్ కూడా గట్టిగానే ఉన్నట్లు అర్ధమవుతోంది.  గతంలో ఎప్పుడు లేని విధంగా డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో  దర్శకుడు బాబీ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. మరి సినిమా ఆడియెన్స్ ని ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

అయితే సినిమా రిలీజ్ డేట్ పై నేడు క్లారిటీ ఇస్తారని అనుకుంటే మళ్ళీ సస్పెన్స్ క్రియేట్ చేశారు. సినిమా నిర్మాత సురేష్ బాబు ఎటు తేల్చుకోలేక రోజుకో చర్చతో వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. అసలైతే సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది కానీ రిలీజ్ టైమ్ బావుంటేనే కలెక్షన్స్ బావుంటాయని నిర్మాత డేర్ చేయలేకపోయారు.  అందుతున్న సమాచారం ప్రకారం డిసెంబర్ 13వ తేదీని రిలీజ్ డేట్ గా ఫిక్స్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సంక్రాంతికే రిలీజ్ చేయాలని అనుకున్నప్పటికీ థియేటర్స్ సమస్యతో పాటు సినిమా బడ్జెట్ కూడా కాస్త కంగారుపెడుతోంది. మొదట వెంకీ మామ సినిమాను 30కోట్ల లోపే పూర్తి చేయాలనీ అనుకున్న సురేష్ బాబు ఆ తరువాత 40కోట్ల వరకు ఖర్చు చేయాల్సి వచ్చింది. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద మినిమమ్ కలెక్షన్స్ రాబట్టాలి.పాజిటివ్ టాక్ వచ్చినా ;కూడా ఈ రోజుల్లో పెట్టిన బడ్జెట్ వెనక్కి తీసుకురావడం అంత ఈజీ కాదు.  

సో రిస్క్ లేకుండా డిసెంబర్ ఫస్ట్ లోనే సినిమాను రిలీజ్ చేయాలనీ సురేష్ బాబు కొత్త డేట్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. నాగ చైతన్య సరసన  రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తుండగా వెంకటేష్ కి జోడిగా పాయల్ రాజ్ పుత్ నటించింది. మరి ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.