స్టార్ ప్రొడ్యూసర్ సురేష్‌ బాబు నిర్మాతగా దర్శకుడు బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'వెంకీ మామ'. వెంకటేష్‌, నాగచైతన్య మామ అల్లుళ్లుగా నటించిన ఈ చిత్రంలో రాశీఖన్నా, పాయల్‌ రాజ్‌పుత్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈనెల13న చిత్ర విడుదల కానున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. అదే సమయంలో ఈ చిత్రం కథ ఏమై ఉంటుందనే విషయమై కూడా రకరకాల ఊహాగానాలు నడుస్తున్నాయి. తాజాగా ఈ చిత్రం లో మేజర్ ట్విస్ట్ రివీల్ అయ్యింది. బుక్ మై షోలో ఇచ్చిన సినాప్సిస్ ప్రకారం ఈ ట్విస్ట్ బయిటకు వచ్చింది.

పల్లెలో ఉండే వెంకటరత్నం అలియాస్ వెంకీ  కు తన మేనల్లుడు కార్తీక్ అంటే ప్రాణం. కార్తీక్ తల్లి,తండ్రులు చనిపోయిన నాటి నుంచి కార్తీక్ ని పెంచుతుంటాడు. అయితే వెంకీ ఇలా తన మేనల్లుడుని దగ్గరకు చేరతీయటం ఆయన తండ్రి,ప్రముఖ జ్యోతిష్యుడు రామ నారాయణ కు ఇష్టం ఉండదు. వద్దని వారిస్తాడు. అయినా వెంకీ తన మేనల్లుడు మీద ఈగ కూడా వాలనీయకుండా జాగ్రత్తగా పెంచుకుంటూ వస్తాడు. కార్తీక్ పెరిగి పెద్దవుతాడు. ఈ క్రమంలో మామయ్యతో మరింత స్నేహంగా, ప్రేమగా, ప్రాణంగా మెలుగుతూంటాడు.

 ఆ స్నేహం,బంధం ఎంత దాకా వెళ్తుంది అంటే ఒకరి కోసం మరొకరు అమ్మాయిని వెతుక్కునేంతవరకూ.  ఇలాంటి పరిస్దితిల్లో కథకు వెంకీ తండ్రి రామ్ నారాయణ ఓ ట్విస్ట్ ఇస్తాడు. జాతకం ప్రకారం వెంకటేష్ మృతి...తన మేనల్లుడు కార్తీక్ చేతుల్లో రాసి పెట్టి ఉంది అని. అందుకే కార్తీక్ ని దూరం పెట్టమన్నాననే విషయం వివరిస్తాడు. అప్పుడు వెంకీ ఏం డెసిషన్ తీసుకుంటాడు. మిలిట్రీకు వెళ్లిన చైతు ఎందుకు తిరిగి వస్తాడు. వెంకీకి, కార్తీక్ కు మధ్య  విభేధాలు ఏమి వస్తాయి , చివరకు ఏం జరుగుతుంది వంటి విషయాలతో కథ నడుస్తుంది. ఇక పాయల్‌ ఈ మూవీలో ఓ స్కూల్‌ టీచర్‌ రోల్‌ లో కనపడుతుంది.  

ప్రభాస్ తో పోల్చుకుంటూ పోస్టర్, వర్మ దిగజారుడుకి పరాకాష్ట!

విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగచైతన్య నటిస్తున్నా చిత్రం 'వెంకీమామ'.. వెంకటేష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ఈ నెల 13 న విడుదల కానుంది. ఇందులో వెంకీ సరసన పాయల్ రాజ్ పుత్ నటించగా, నాగచైతన్య సరసన రాశీఖన్నా నటించింది. సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. తమన్ సంగీతం అందించాడు. బాబీ( కే. యస్ రవీంద్ర ) ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.