Asianet News TeluguAsianet News Telugu

ప్రభాస్ తో పోల్చుకుంటూ పోస్టర్, వర్మ దిగజారుడుకి పరాకాష్ట!

వివరాల్లోకి వెళితే తాజాగా రామ్ గోపాల్ వర్మ ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ టైటిల్ తో తెరకెక్కించగా దీనిపై పలు వివాదాలు రావడంతో టైటిల్ ను ‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’ అని మార్చారు.

RGV shares Baahubali morphed poster
Author
Hyderabad, First Published Dec 9, 2019, 12:53 PM IST

 ఒకప్పుడు హిట్ , ఫ్లాఫ్ లకు సంభంధం లేకుండా విభిన్న చిత్రాలని రూపొందిస్తూ అభిమానులను సంపాదించుకున్న వర్మ..ఈ మధ్యకాలంలో మరీ దిగజారుడు స్ట్రాటజీలతో ముందుకు వెళ్తున్నారు. ఏదో ఒక వివాదాస్పద సబ్జెక్ట్ ని ఎంచుకుని, దానికి తన సినిమాని ముడిపెట్టి ఓపినింగ్స్ రప్పించుకుని ఒడ్డున పడిపోవాలనుకుంటున్నాడే తప్ప...జనాలకు నచ్చే సినిమా తీయాలనుకోవటం లేదు.

దానికి తోడు ఆ పబ్లిసిటీ లో కూడా మార్ఫింగ్ లకు విపరీతమైన ప్రయారిటీ ఇస్తున్నారు. తాజాగా తనను తాను ప్రభాస్ తో పోల్చుకుంటూ ...షేర్ చేసిన బాహుబలి తరహా పోస్టర్...ఆయన అభిమానులకు సైతం రుచించంటం లేదు. బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు.
 
వివరాల్లోకి వెళితే తాజాగా రామ్ గోపాల్ వర్మ ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ టైటిల్ తో తెరకెక్కించగా దీనిపై పలు వివాదాలు రావడంతో టైటిల్ ను ‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’ అని మార్చారు. ఈ మధ్యనే  ఈ మూవీకి ఇటీవల సెన్సార్ పనులు పూర్తి చేసుకుని యు/ఏ సర్టిఫికెట్ ని ఆర్జీవీ కేఏ పాల్ చేతుల మీదుగా అందుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోను కూడా వర్మ షేర్ చేసారు. ఈ మూవీని డిసెంబర్ 12 న విడుదల చేస్తున్న సందర్బంగా ప్రేక్షకులకు ఇంట్రస్టట్ కలిగించేందుకు వర్మ బాహుబలితో తనను తాను పోల్చుకుంటూ ఓ పోస్టర్ ని వదిలారు.  

తెలుగు తెరపై కొత్త రుచులు.. ఏడాది రచ్చ చేసిన హీరోయిన్లు వీరే!

ఈ పోస్టర్ లో  వర్మ బాహుబలి శివలింగాన్ని ఎత్తుకున్న ఫోటోను మార్ఫింగ్ చేసి తను ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ మూవీని మోస్తున్నట్లుగా ఉన్న ఫోటోను వర్మ ట్విట్టర్ లో షేర్ చేస్తూ.. ‘డిసెంబర్ 12 న బాహుబలి వస్తున్నాడు’ అని ట్వీట్ చేసారు. దీంతో ఈ పిక్ తెగ వైరల్ అవుతోంది.  అదే సమయంలో విమర్శల పాలవుతోంది.

ఈ సినిమా గురించి వర్మ మాట్లాడుతూ...చిన్నప్పటి నుంచి గిల్లడం అంటే తనకు ఇష్టమని.. అందుకే కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమా తీశానని  రామ్ గోపాల్ వర్మ అన్నారు. ఈ సినిమాలో ఏ వర్గాన్ని తక్కువ చేసి చూపించలేదన్న వర్మ.. ఇదొక మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ అని చెప్పుకొచ్చాడు. తనకు ఇంట్రస్ట్ గా అనిపించిన అంశాన్నే సినిమాగా తీస్తానని.. ఈ సినిమా తీసినందుకు ఎవరి దగ్గరి నుంచి తనకు బెదిరింపులు రాలేదని వెల్లడించాడు. మామూలు క్రైమ్ కంటే పొలిటికల్ క్రైమ్ ఇంట్రెస్టింగ్‌గా ఉందని.. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు చిత్రాన్ని ఓ ప్రముఖ తండ్రీ కొడుకులకు అంకితం ఇస్తానని ఆయన చెప్పుకొచ్చాడు.  

 

Follow Us:
Download App:
  • android
  • ios