వెంకటేశ్, నాగచైతన్యల మల్టీస్టారర్‌ మూవీ ‘వెంకీ మామ’ . కేయస్‌ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో పాయల్‌ రాజ్‌పుత్, రాశీ ఖన్నా హీరోయిన్స్. సురేశ్‌బాబు, టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించారు.  డిసెంబర్‌ 13 వెంకటేశ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా రిలీజ్‌ కానుంది. ఈ నేపధ్యంలో  వెంకీ అభిమానులు, అక్కినేని అభిమానులు కలిసి...మామా అల్లుళ్ల అల్లరిని ఎప్పుడు స్కీన్ర్‌ మీద ఎప్పుడెప్పుడు చూద్దామా? అని ఎదురు చూస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఎలా వచ్చింది...ఏ స్దాయి హిట్ అవుతుంది వంటి విషయాలపై ఫిల్మ్ నగర్ టాక్ ఏంటో చూద్దాం.

ఫిల్మ్ నగర్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు వెంకీ మామ ..ఫన్ ని ఆశించి థియోటర్ కు వెళ్లే వారికి పెద్దగా నచ్చదు. ఎందుకంటే నవ్వులు తక్కువే. ఫ్యామిలీ ఎమోషన్స్ పై ఎక్కువ దృష్టి పెట్టారు.వాస్తవానికి సినిమా లాంగ్ రన్ ఆ భావోద్వేగాలే ఉపయోగపడతాయి. అలాగే వార్ సీన్స్ కూడా జస్ట్ ఓకే అన్నట్లుగా ఉన్నాయని,సీరియస్ నెస్ లేదని చెప్తున్నారు. అది ఎంతవకూ నిజమో తెరపై చూస్తే కానీ చెప్పలేం.  

ప్రేమ పెళ్లి.. ఏడాది తిరగకుండానే.. హీరోయిన్ విడాకులు

మిలిటరీ ట్రాక్ లో కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉన్నాయని, అవి కథలో గాఢతను తగ్గిస్తాయంటున్నారు.  అయితే సినిమాలో కొన్ని కామెడీ ఎపిసోడ్స్ మాత్రం చాలా హైలెట్ గా వచ్చాయిట. ఇది వెంకటేష్ వన్ మ్యాన్ షో అని, నాగచైతన్య ..వెంకీ ముందు ఆనలేదని అంటున్నారు. ఓవరాల్ గా వెంకి మామ యావరేజ్ అని, అయితే ఎమోషన్స్ పడితే మాత్రం మంచి హిట్ అవుతుందని చెప్తున్నారు.అయితే ఇది కేవలం ఫిల్మ్ నగర్ టాక్ మాత్రమే. సినిమా రిలీజ్ అయితే కానీ అసలు మ్యాటర్ ఏంటనేది బయిటకు రాదు. సురేష్ బాబు లాంటి నిర్మాత ..చాలా జాగ్రత్తలు తీసుకుని చెక్కి వదిలిన శిల్పం ఇది. అయితే దర్శకుడు బాబీ ట్రాక్ రికార్డే సినిమా పై అంచనాలు తగ్గిస్తున్నాయనేది నిజం.
 
 విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగచైతన్య నటిస్తున్నా చిత్రం 'వెంకీమామ'.. వెంకటేష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ఈ నెల 13 న విడుదల కానుంది. ఇందులో వెంకీ సరసన పాయల్ రాజ్ పుత్ నటించగా, నాగచైతన్య సరసన రాశీఖన్నా నటించింది. సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. తమన్ సంగీతం అందించాడు. బాబీ( కే. యస్ రవీంద్ర ) ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.