'కొత్తబంగారు లోకం' సినిమాతో వెండితెరకి పరిచయమైన శ్వేతా బసు ప్రసాద్ తొలి చిత్రంతోనే హిట్ అందుకుంది. టాలీవుడ్ లో కొన్ని చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ ఆ తరువాత కొన్ని వివాదాల్లో ఇరుక్కుంది. దీంతో టాలీవుడ్ నుండి బాలీవుడ్ కి వెళ్లిపోయింది.

అక్కడ కొన్ని చిత్రాలకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పని చేసింది. ఆ సమయంలోనే ఈ బ్యూటీకి రోహిత్ మిట్టల్ తో పరిచయమైంది. గతేడాది పూనేలో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. మరో మూడు రోజుల్లో మొదటి పెళ్లి రోజు వార్షికోత్సవాన్ని గ్రాండ్ గా జరుపుకోవాల్సిన వీరు ఇప్పుడు విడిపోతున్నట్లు అనౌన్స్ చేసి షాక్ ఇచ్చారు.

పెళ్లైన ఏడాదికే తన భర్తతో విడిపోతున్నట్లు శ్వేతాబసు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. తమ వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెడుతూ.. భర్త రోహిత్ మిట్టల్, తను పరస్పర అంగీకారనంతో విడిపోతున్నట్లు ప్రకటించింది. ఇకపై ఎవరి దారులు వారివి అంటూ సోషల్ మిదలో రాసుకొచ్చింది. 

కొన్ని నెలల పాటు ఆలోచించిన తరువాత విడిపోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు వేదాంతం వల్లించింది. ఈ ఏడాది కాలంలో తనకు ఎన్నో మధుర జ్ఞాపకాలను అందించిన రోహిత్ కి థాంక్స్ కూడా చెప్పింది. జీవితంలో రోహిత్ కి ఎప్పుడూ చీర్ లీడర్ లా ఉంటానని తెలిపింది.