విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ కెరీర్‌లో దూసుకుపోతున్న స్టార్ హీరో వెంకటేశ్‌. రీసెంట్ గా ఆయన బాబీ దర్శకత్వంలో నాగచైతన్యతో కలిసి ‘వెంకీమామ’ చేసారు. ఆ సినిమా బాగానే వర్కవుట్ అయ్యింది. దీని తర్వాత తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు చెప్పారు కానీ.... తమిళ హిట్‌ ‘అసురన్‌’ రీమేక్‌ పనిలో పడ్డారు. ఈ విషయమై ఇప్పటికే సురేష్‌ ప్రొడక్షన్స్‌ అధికారికంగా ప్రకటించింది.

తెలుగులో ‘అసురన్‌’ రీమేక్‌ చేసేందుకు పలువురు దర్శకుల పేర్లు వినిపించినా..చివరకు శ్రీకాంత్ అడ్డాలని సీన్ లోకి తెచ్చారు. జనవరి 2న రామానాయుడు స్టూడియోలో ఈ చిత్రం ఓపినింగ్ జరుగుతుంది. ఆ రోజు నుంచే షూటింగ్ మొదలెడతారు. సంక్రాంతికి కాస్త బ్రేక్ తీసుకుని, పండుగ అయ్యాక మళ్లీ రెగ్యులర్ షూటింగ్ జరుపుతారు. 2020 వేసవికు ఈ సినిమాని టార్గెట్ చేస్తారు.

ప్రముఖ టీవీ సెలెబ్రిటీ అనుమానాస్పద మృతి.. వంటగదిలో మృతదేహం!

మరో ప్రక్క ఇప్పటికే వెంకటేష్ ఈ సినిమా కోసం ప్రీ లుక్ చేసారు. ఈ మేరకు ఓ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రెడీ చేసారు. జనవరి 1న నూతన సంవత్సరం సందర్బంగా ఈ పోస్టర్ ని విడుదల చేస్తారు. అంటే షూటింగ్ మొదలు కాకుండానే ఫస్ట్ లుక్ వచ్చేస్తుందన్నమాట. ఈ పస్ట్ లుక్ చాలా విభిన్నంగా..రెగ్యులర్ వెంకటేష్ చిత్రాలు చూసేవారికి ఆశ్చర్యం కలిగేలా డిజైన్ చేసారట. ఈ విషమయై ఇప్పటికే నాలుగు డిజైన్స్ దాకా చేసి సురేష్ బాబు ఎదురుగా పెట్టి అందులో ఒకటి ఫైనల్ చేసి వదిలే పనిలో ఉన్నారట. ఈ సినిమా రిలీజ్ కు ఎంతో టైమ్ ఉండదు కాబట్టి..ప్రమోషన్ ఏక్టవిటీస్ షూటింగ్ తో పాటే జరగాలని భావిస్తున్నారట. ఈ స్ట్రాటజీలో భాగమే ఇలా ఫస్ట్ లుక్ వదలటం అని చెప్తున్నారు.

 ఇక  తమిళ చిత్రం ‘అసురన్‌’లో ధనుష్‌ కుర్రాడిగాను, మధ్య వయస్కుడిగాను కనిపిస్తాడు. రెండింటిలోనూ ధనుష్‌ తనదైన శైలిలో అదరకొట్టాడు. ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో రీమేక్‌ చేసే క్రమంలో తమిళ మాదరింగా రెండు పాత్రలు వెంకటేష్ చేయకుండా...మరో హీరో ని తీసుకుంటున్నారు.  మధ్య వయస్కుడిగా వెంకటేశ్‌ కనిపిస్తారు. అదే సమయంలో యంగ్ హీరో పాత్ర కోసం మరో హీరో పేరును పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. ఈ మేరకు సురేష్ ప్రొడక్షన్స్ ఇప్పటికే ప్రకటన కూడా ఇచ్చింది.

అయితే అదే సమయంలో ఈ సినిమాలోకుర్ర హీరో పాత్ర కోసం రానా పేరు పరిశీలనలో ఉందని తెలుస్తోంది. అదే నిజమైతే దగ్గుబాటి హీరోలు కలసి నటించే తొలి ఇదే అవుతుంది. సరైన కథ దొరికితే దగ్గుబాటి మల్టీ స్టారర్‌కి సిద్ధమే అని వెంకటేశ్‌, రానా ఇదివరకే ప్రకటించటంతో ఈ ప్రాజెక్టులో రానా చేస్తే బాగుంటుందని ఆశిస్తున్నారు. రానా పేరుతోపాటు మరికొంతమంది  యంగ్ యాక్టర్స్ ని  పేర్లూ పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ విషయమై నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు.