ప్రముఖ టీవీ సెలెబ్రిటీ, మోడల్ అయిన జాగీ జాన్ సోమవారం మృతి చెందారు. ఆమె కేరళలోని కురవాన్ కోణంలో తన నివాసంలో అనుమానాస్పద రీతిలో మరణించినట్లు తెలుస్తోంది. సోమవారం సాయంత్రం 4 గంటలకు జాగీ జాన్ మృత దేహాన్ని ఆమె స్నేహితురాలు ఒకరు గుర్తించారు. 

చెఫ్ గా, మోడల్ గా జాగీ జాన్ బాగా పాపులర్ అయింది. ఆమె స్నేహితురాలు ఇచ్చిన సమాచారం మేరకు జాగీ జాన్ వంటగదిలో విగతజీవి అయి కనిపించినట్లు తెలుస్తోంది. కానీ ఆమె శరీరంపై ఎలాంటి గాయాలు లేవు. ఆ సమయంలో జాగీ జాన్ తల్లి ఇంట్లోనే ఉన్నారు. ఆమె మానసిక స్థితి సరిగా లేకపోవడంతో జాగీ జాన్ మృతికి గల స్పష్టమైన కారణాలు తెలియడం లేదని పేరొర్కోడా ప్రాంత పోలీసులు మీడియాకు తెలిపారు. 

జాగీజాన్ ఏమైనా వ్యాధితో బాధపడుతున్నారా, ఆమె వ్యక్తిగత జీవితం ఎలా ఉంది అనే కోణంలో దర్యాప్తు చేస్తూ మృతికి గల కారణాలు అన్వేషిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. జాగీ జాన్ గాయని కూడా. అలాగే ఉత్తేజపరిచే ప్రసంగాలు కూడా ఇవ్వగలదు. 

జాగీజాన్ మల్టీటాలెంటెడ్ పర్సనాలిటీ అని ఆమె స్నేహితులు చెబుతున్నారు. జాగీ జాన్ సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉండేవారు. తరచుగా తా ఫోటోలు షేర్ చేస్తో అభిమానులతో టచ్ లో ఉండేవారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

#rosecollections #indianlady #indiansaree #yellowlove #yellowlover💛 #yellowsaree

A post shared by Jagee John (@jageejohn) on Sep 19, 2019 at 2:36am PDT

ప్రస్తుతం ఓ టెలివిజన్ ఛానల్ లో జాగీ జాన్ 'జాగీ కుక్ బుక్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇంతలోనే జాగీ ఇలా మరణించడంతో ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు విషాదంలో మునిగిపోయారు.