మెగాఫ్యామిలీ నుండి వచ్చిన హీరో వరుణ్ తేజ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. మొదటినుండి కూడా వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ హిట్ల మీద హిట్లు కొడుతూ తన సత్తా చాటుతున్నాడు. గతేడాది 'గద్దలకొండ గణేష్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వరుణ్ తేజ్ ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు.

ఇందులో వరుణ్ తేజ్ ప్రొఫెషనల్ బాక్సర్ గా కనిపించనున్నారు. దీనికోసం ముంబైలో ఫిట్ నెస్ ట్రైనర్ రాకేశ్ ఉడయార్, బాక్సర్ నీరజ్ గోయత్ ల వద్ద రెండు వారాలుగా శిక్షణ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు వరుణ్ తేజ్.

పెళ్లి చేసుకున్న కమెడియన్ యోగిబాబు.. అమ్మాయి ఎవరంటే..?

బాలీవుడ్ లో మీ ఫేవరేట్ హీరో ఎవరని వరుణ్ తేజ్ ని ప్రశ్నించగా.. షారుఖ్ ఖాన్ అని సమాధానమిచ్చాడు. ఒకసారి షారుఖ్.. రామ్ చరణ్ ఇంటికి వచ్చారని.. కానీ తను మాత్రం షారుఖ్ ని దూరం నుండి చూస్తూ ఉండిపోయానని.. ఆయనతో కాఫీ తాగుతూ ముచ్చటించాలని ఉందని.. ఆయన నుండి చాలా విషయాలు నేర్చుకోవాలనుందని చెప్పారు.

ఆయనతో కలిసి పని చేసే ఛాన్స్ వస్తే.. కచ్చితంగా సినిమా చేస్తానని అన్నారు. ప్రస్తుతం తనకు బాలీవుడ్ లో ఆఫర్లు వస్తున్నాయని.. కానీ షెడ్యూల్ సహకరించక, కథ నచ్చక కొన్ని సినిమాలు వదులుకున్నట్లు చెప్పారు. తనకు బాలీవుడ్ సినిమాల్లో నటించడం చాలా ఇష్టమని.. కంటెంట్ బాగుంటే తనకు భాష విషయంలో పట్టింపులు లేవని అన్నారు.