ఒక సినిమా చేజారితే మన దర్శకులు వెంటనే మరో సినిమాను చేతిలోకి తీసుకుంటారు. సుకుమార్ స్క్రిప్ట్ ని మహేష్ కాదంటే.. అయన వెంటనే అదే ప్రాజెక్ట్ ని బన్నీతో తెరకెక్కిస్తున్నారు. కానీ వంశీ పైడిపల్లి మాత్రం మహేష్ తో ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవడాన్ని అంత సులువుగా మర్చిపోలేకపోతున్నారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

ఈ మధ్య కాలంలో మహేష్ తో అసోసియేట్ అవ్వడం, 'మహర్షి' సినిమా నుండి నిన్న మొన్నటి వరకు రెండు కుటుంబాలు బాగా కలిసి కనిపించాయి. పార్టీలు, ట్రిప్ లకు కలిసే వెళ్లారు. 'సరిలేరు నీకెవ్వరు' సినిమా సమయంలో మహేష్ బాబుని అతడి కూతురు సితార, వంశీ పైడిపల్లి కూతురు ఇద్దరూ కలిసి ఇంటర్వ్యూ చేశారు.

వంశీని పక్కన పెట్టిన మహేష్.. కారణమేమిటంటే..?

ఇలా చాలానే ఉన్నాయి. రెండు కుటుంబాలు ఒక్కటే అన్నంతగా కలిసిపోయాయి. అలాంటిది ఒక్కసారిగా ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది. అయితే ఈ విషయంలో వంశీ పెద్దగా బాధ పడలేదట. కానీ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందనే ప్రచారాన్ని నెగెటివ్ గా చేస్తుండడంతో వంశీ అవమానంగా ఫీల్ అవుతున్నాడట.

స్క్రిప్ట్ చేయలేకపోయాడు, మహేష్ ఇచ్చిన ఛాన్స్ ని నిలబెట్టుకోలేకపోయాడు అంటూ నెగెటివ్ వార్తలను స్ప్రెడ్ చేస్తుండడంతో వంశీ చాలా బాధకి లోనవుతున్నాడని చెబుతున్నారు.

ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిన వెంటనే సోషల్ మీడియాలో వార్తలు రావడం వెనుక మహేష్ టీమ్ ఉందని వంశీ భావిస్తున్నాడట. అందుకే అవమానంగా భావించి నిద్రలేని రాత్రులు గడుపుతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.