సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో పెద్ద హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తన తదుపరి సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. నిజానికి మహేష్ తన నెక్స్ట్ సినిమా వంశీ పైడిపల్లితో చేయాల్సివుంది.

'మహర్షి' సినిమా సమయంలోనే వంశీతో మరో సినిమా చేస్తానని మాటిచ్చాడు. మహేష్ కోసమే ఇన్నాళ్లు వంశీ ఎదురుచూశాడు. దిల్ రాజు ఈ సినిమాని నిర్మించాల్సివుంది. కానీ ఇప్పుడు సినిమా ఆగిపోయిందని సమాచారం.

దేవిశ్రీని పక్కన పెట్టేసిన మహేష్ బాబు..?

వంశీ చెప్పిన కథ మహేష్ కి నచ్చలేదని టాక్. మాఫియా బ్యాక్ డ్రాప్ లో వంశీ రాసుకున్న కథ తనకు సూట్ కాదని మహేష్ భావిస్తున్నాడట. తన క్యారెక్టర్ ని రాసుకున్న తీరు కూడా మహేష్ ని ఇంప్రెస్ చేయలేకపోయింది. దీంతో కొంతకాలం ఈ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టాలని భావిస్తున్నాడు.

వంశీకి బదులుగా మరో డైరెక్టర్ తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడని చెబుతున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్ కూడా త్వరలోనే అఫీషియల్ గా రానుందని టాక్. మరి ఈలోగా వంశీ.. మహేష్ కోసం మరో కథను సిద్ధం చేసుకుంటాడా..? లేక అదే కథతో మరో హీరోతో సినిమా చేస్తాడో చూడాలి..!