నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి రూపొందిస్తోన్న చిత్రం 'వి'. ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ కొద్దిరోజుల క్రితమే పూర్తయ్యింది. ఈ సినిమాలో మొదటిసారిగా నాని విలన్ పాత్రలో కనిపించనున్నారు.

ఇది ఇలా ఉండగా.. ఈ సినిమాలో సుధీర్, నానిలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ముందుగా సుధీర్.. ''తప్పు జరిగితే యముడు వస్తాడనేది నమ్మకం... వీడొస్తాడనేది మాత్రం నిజం'' అంటూ సినిమాలో తన లుక్ ని సోమవారం నాడు విడుదల చేశారు.

షాకింగ్ లీక్ :ఎన్టీఆర్, త్రివిక్రమ్ చిత్రం స్టోరీ లైన్, నేపధ్యం!

మంగళవారం నాడు హీరో నాని తన లుక్ ని ట్విట్టర్ లో రిలీజ్ చేశారు. తన రోల్ కి తగ్గట్లు నాని.. గడ్డం, మీసాలతో చాలా రఫ్ గా కనిపిస్తున్నారు. పైగా చేతిలో కత్తెర దానికి రక్తం ఇదంతా చూస్తుంటే సినిమాలో నాని పాత్ర చాలా వయిలంట్ గా ఉంటుందనిపిస్తుంది.

ఈ సినిమాలో సుధీర్, నానిలకు జోడీగా అదితిరావు హైదరి, నివేదా థామస్ లు కనిపించనున్నారు. జ‌గ‌ప‌తిబాబు, శ్రీ‌నివాస్ అవ‌స‌రాల‌, వెన్నెల కిషోర్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. కాగా, మార్చి 25న ఉగాది కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.