బాహుబలి అనంతరం ప్రభాస్ నుంచి వచ్చిన బిగ్ బడ్జెట్ మూవీ సాహో ఊహించని విధంగా బయ్యర్స్ ని దెబ్బకొట్టిన విషయం తెలిసిందే. దాదాపు 350కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన సాహో వల్ల నిర్మాతలైతే సేవ్ అయ్యారు గాని మధ్యలో బయ్యర్స్ స్ట్రిబ్యూటర్స్ కి కోలుకోలేని దెబ్బ పడింది. యువ దర్శకుడు సుజిత్ పై నమ్మకంతో చేసిన ప్రయోగం హిందీలో తప్పితే మరెక్కడా వర్కౌట్ కాలేదు.

 ఇక మొత్తానికి సినిమా వర్కౌట్ కాకపోయినప్పటికీ యూవీ క్రియేషన్స్ తో సుజిత్ టచ్ లో ఉంటున్నాడట. అలాగే మరో అవకాశం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. మొదట్లో వీరి కాంబినేషన్ లో రన్ రాజా రన్ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఆ సినిమా కమర్షియల్ గా మంచి లాభాలని అందించింది. శర్వానంద్ కెరీర్ కి కూడా ఆ సినిమా మంచి బూస్ట్ ఇచ్చింది.

ఇకపోతే మరోసారి అదే కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది.  దర్శకుడు సుజిత్ ఇటీవల శర్వానంద్ కి ఒక స్టోరీ వినిపించాడట. కథ నచ్చడంతో శ్రీకారం షూటింగ్ అయిపోగానే చేద్దామని క్లారిటీ ఇచ్చాడట. యూవీ క్రియేషన్స్ మరోసారి సుజిత్ కోసం బడ్జెట్ ని పట్టించుకోకుండా సినిమాను నిర్మించేందుకు సిద్దమైనట్లు సమాచారం. సాహో రిలీజ్ తరువాత సుజిత్ బయట ఎక్కువగా కనిపించలేదు, నెక్స్ట్ సినిమా స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నట్లు కథనాలు వెలువడ్డాయి. ఇక త్వరలోనే ఆ కొత్త స్క్రిప్ట్ సెట్స్ పైకి రానున్నట్లు టాక్. మరి ఈ సినిమాతో సుజిత్ యూవీ కి ఎలాంటి సక్సెస్ ని అందిస్తాడో చూడాలి.

Jabardasth show : నేను 'జబర్దస్త్' చేయడం లేదు.. నాగబాబు కామెంట్స్!