సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా రష్మిక హీరోయిన్ గా నటించింది. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్, ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర నిర్మించారు.

దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. సంక్రాంతి కానుకగా తాజాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా మహేష్ అభిమానులు ఈ సినిమా కోసం థియేటర్ల వద్ద ఎగబడుతున్నారు. దీంతో సినిమా తొలిరోజు భారీ వసూళ్లను సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.

'సరిలేరు నీకెవ్వరు' ట్విట్టర్ రివ్యూ!

ముఖ్యంగా ఓవర్సీస్ లో మహేష్ రికార్డులు సృష్టిస్తాడని భావిస్తున్నారు. ఇప్పటికే అమెరికాలో ప్రీమియర్స్ అంటూ ఈ సినిమా అక్కడ దుమ్మురేపుతోంది. తాజాగా సమాచారం ప్రకారం ఇప్పటివరకు 'సరిలేరు నీకెవ్వరు' యూఎస్ ప్రీమియర్స్ ద్వారా 620,000 లక్షల డాలర్లు వసూలు చేసింది.

రాత్రి పూర్తేయ్యే నాటికి ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది. అంటే కేవలం ప్రీమియర్ షోల ద్వారానే 'సరిలేరు నీకెవ్వరు' సినిమా వన్ మిలియన్ వసూళ్లకు చేరువవుతుంది. ఈ లెక్కన వీకెండ్ లో మరిన్ని వసూళ్లు రాబట్టడం ఖాయమనిపిస్తోంది. లాంగ్ రన్ లో ఈ సినిమా యూఎస్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడం ఖాయం.