ఈ సినిమాతో సీనియర్‌ నటి విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్ షోలు అమెరికా లాంటి దేశాల్లో ప్రదర్శించడంతో సినిమా టాక్ బయటకి వచ్చింది. 

సూపర్‌ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా శనివారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మహేష్ బాబు, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు సినిమాను దిల్ రాజు, అనిల్‌ సుంకరలతో కలిసి మహేష్‌ స్వయంగా నిర్మించారు. 

ఈ సినిమాతో సీనియర్‌ నటి విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్ షోలు అమెరికా లాంటి దేశాల్లో ప్రదర్శించడంతో సినిమా టాక్ బయటకి వచ్చింది. ప్రీమియర్లు చూసిన అభిమానులు తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.

'సరిలేరు నీకెవ్వరు!' ప్రీమియర్ షో టాక్

సినిమాలో కామెడీ సీక్వెన్సులు మాములుగా లేవని.. కడుపులు చెక్కలైపోవడం ఖాయమంటున్నారు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ ట్రైన్ ఎపిసోడ్ హిలారియస్ గా ఉందని చెబుతున్నారు. 'జబర్దస్త్' కమెడియన్స్ తో చేయించిన కామెడీ సినిమాకి మరో ప్లస్ అని అంటున్నారు. సినిమాలో కామెడీతో పాటు యాక్షన్ కూడా ఆకట్టుకుంటుందని చెబుతున్నారు. 

ఫస్ట్ హాఫ్ ఎంతో సరదాగా సాగిపోతుందని.. సెకండ్ హాఫ్ లో విజయశాంతి ఎంట్రీ.. ఆమె స్టోరీ సినిమాకి ఆయువుపట్టు అని తెలుస్తోంది. ప్రకాష్ రాజ్ మరోసారి విలన్ పాత్రలో జీవించేశాడని టాక్. మహేష్ బాబు ఎప్పటిలానే తన స్క్రీన్ ప్రెజన్స్ తో ఆడియన్స్ ని మెప్పిస్తాడని చెబుతున్నారు. 

సినిమా అంతా ఎంటర్‌టైనింగ్‌గా ఉందని.. ఈ సినిమాతో మహేష్ బాబు మరోసారి బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేయడం ఖాయమని అంటున్నారు. 

Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…