మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న మరో హీరో వైష్ణవ్ తేజ్. సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ సోదరుడైన వైష్ణవ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం ఉప్పెన. తొలి చిత్రంతోనే మైత్రి మూవీస్ లాంటి పెద్ద బ్యానర్ లో నటించే అవకాశం వైష్ణవ్ కు దక్కింది. అంతే కాదు ఈ చిత్రానికి స్వయంగా సుకుమార్ కథ అందిస్తున్నారు. 

రాక్ స్టార్ దేవిశ్రీ సంగీత దర్శకుడు. ఇంతటి క్రేజీ కాంబోలో తన డెబ్యూ చిత్రం తెరకెక్కే ఛాన్స్ వైష్ణవ్ కు దక్కింది. డెబ్యూ దర్శకుడు బుచ్చిబాబు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇతడు కూడా సుకుమార్ శిష్యుడే. ఫస్ట్ లుక్ విడుదలైనప్పటి నుంచి ఉప్పెన చిత్రపై మంచి బజ్ ఏర్పడింది. 

ఇక చిత్ర యూనిట్ సాంగ్స్ కూడా రిలీజ్ చేస్తోంది. తాజాగా 'ధక్ ధక్ ధక్' అనే సాంగ్ వీడియో చిత్ర యూనిట్ విడుదల చేసింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, బుచ్చిబాబు చిత్రీకరణ అద్భుతంగా ఉన్నాయి. 

పోసానితో తిట్టించారు, అంతు చూస్తా అన్నారు.. ఆయన లేకుంటే ఆత్మహత్య చేసుకునే వాడిని!

వైష్ణవ్ తేజ్ రఫ్ లుక్ లో ఆకట్టుకుంటుండగా, హీరోయిన్ కృతి శెట్టి క్యూట్ లుక్స్ తో మెప్పిస్తోంది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ చూడ చక్కగా ఉంది. సాంగ్ లోని ప్రతి ఫ్రేమ్ కలర్ ఫుల్ గా కనిపిస్తోంది. ఇక సాంగ్ లోని ఓ షాట్ లో వైష్ణవ్ తేజ్ టీ గ్లాసుతో కనిపిస్తున్నాడు. మెగా హీరో టీ గ్లాసుతో కనిపించగానే అభిమానులకు పవన్ కళ్యాణ్ గుర్తుకు వస్తాడని చెప్పడంలో సందేహం లేదు. 

పాటలో ధక్ ధక్ అనే సందర్భం వచ్చినప్పుడల్లా దేవిశ్రీ విభిన్నమైన శబ్దాలని ఉపయోగించాడు. పాటలో ఆ ప్రయోగం చాలా బావుంది. చివరికి కుక్క కూడా ధక్ ధక్ అనే సంధర్భం వచ్చినప్పుడు భౌ భౌ అని అంటుంది. మొత్తంగా ఈ పాట సినిమాపై ఆసక్తిని పెంచే విధంగా ఉంది. ఏప్రిల్ 2న ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.