మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌, స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రం 'అల.. వైకుంఠపురములో'. ఈ సినిమాలో బన్నీకి జోడీగా పూజా హెగ్డే నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, పాటలు బాగా పాపులర్ అయ్యాయి.

ఈ సినిమా టీజర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఈ టీజర్ గ్లింప్స్. టీజర్  పై అంచనాలను మరింత పెంచేస్తుంది. మరికాసేపట్లో విడుదల కానున్న టీజర్ ఎలా ఉండబోతుందనే విషయంపై కొన్ని వార్తలు బయటకి వచ్చాయి.

'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమా ఫ్లాప్.. అయితే ఏంటి..?

టీజర్ నిడివి నిమిషం కి ఒకట్రెండు సెకన్లు అటు ఇటుగా ఉంటుందని తెలుస్తోంది. దాదాపు సినిమాలో వున్న కీలక క్యారెక్టర్లు అన్నీ టీజర్ లో కనిపించే అవకాశం వుంది. అలానే ఓ మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కి కావాల్సిన అన్ని అంశాలు టీజర్ లో కనిపిస్తాయని సమాచారం. యాక్షన్, ఫ్యామిలీ టచ్, గ్లామర్, ఫన్ అన్నీ ఉండేలా చూసుకున్నారట.

త్రివిక్రమ్ స్టైల్ లో ఒకట్రెండు యాక్షన్ కట్ లు కూడా ఉంటాయట. కాగా, ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లపై అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. టబు, రాజేంద్రప్రసాద్, సచిన్ ఖేడ్ కర్, తనికెళ్ళ భరణి, మురళీ శర్మ, సముద్ర ఖని, జయరాం, సునీల్, నవదీప్, సుశాంత్, నివేతా పేతురాజ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.