పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నచ్చి చేసిన సినిమా 'సర్దార్ గబ్బర్ సింగ్'. ఈ సినిమా కోసం మూడేళ్లకు పైగా పని చేశాడు. సొంతంగా స్క్రిప్ట్ రాసి.. సంపత్ నందితో ఏడాదికి పైగా పని చేసి ఆ తరువాత అతడి ట్రీట్మెంట్ నచ్చక పక్కన పెట్టి.. చివరికి 'పవర్' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన బాబీ చేతికి సినిమా అప్పగించాడు.

అతడు తనవంతుగా గట్టి ప్రయత్నమే చేశాడు కానీ సినిమా మాత్రం ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది. పవన్ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ లలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా పోయిందని చాలా మంది దర్శకుడు బాబీని తిట్టారు.

మరికొందరేమో.. పవన్ మొత్తం చూసుకుంటే బాబీ తప్పు ఎలా ఉంటుందని అతడికి సపోర్ట్ గా నిలిచారు. ఏదేమైనా.. 'సర్దార్' ఫ్లాప్ ఎఫెక్ట్ బాబీపై పడింది. అయితే బాబీ మాత్రం ఆ సినిమా డిజాస్టర్ కావడం పట్ల తనకు పెద్ద బాధేమీ లేదని.. అది తన కెరీర్ ని దెబ్బ తీసిందని అనుకోవడం లేదని అంటున్నాడు బాబీ.

డబ్బుకోసం ఈ హీరోల మోసం.. ఫ్యాన్స్ ఫిదా!

తన కొత్త సినిమా 'వెంకీ మామ' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో అతడు 'సర్దార్' సినిమా గురించి మాట్లాడాడు. సినిమా ఇండస్ట్రీలో అపజయాలు ఖాయమని, ఏ సినిమా ఫలితం ఎలా ఉంటుందో ఎవ్వరూ చెప్పలేరని.. 'సర్దార్' ఫలితం గురించి తాను అసలు బాధ పడలేదని బాబీ స్పష్టం చేశాడు. అది తాను కావాలని చేసిన సినిమా కాదని, పవన్ తనను ఎన్నుకున్నాడని అన్నారు.

తాను పవన్ కళ్యాణ్ కి పెద్ద ఫ్యాన్ అని, జీవితంలో ఒక్క ఫోటో అయినా దిగితే బాగుండనే వ్యక్తితో సినిమా చేయడం అన్నది నమ్మశక్యం కాని విషయమని, రెండేళ్ల పాటు ఆయనతో ప్రయత్నించడం అద్భుతమైన అనుభవమని.. ఆ రెండేళ్లలో ప్రతీరోజుని, ప్రతీ క్షణాన్ని ఆశ్వాదించానని, ఆ జ్ఞాపకాలు తనకు చాలని.. కాబట్టి సినిమా రిజల్ట్ గురించి తనకు బాధేమీ లేదని అన్నారు.