తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఒక్క హిట్టొస్తే చాలు వెంటనే తెలుగు మార్కెట్ పై కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. కమల్ హాసన్ - రజినీకాంత్ లు తమిళ్ లో సక్సెస్ లు అందుకున్నట్లుగానే తెలుగులో కూడా సాలిడ్ హిట్స్ అందుకున్నారు. కొన్నిసార్లు డైరెక్ట్ తెలుగు సినిమాల్లో కూడా నటించి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షించారు.

రాజమౌళి RRR మూవీ: కొమురం భీమ్, అల్లూరి సీతారామారాజు మధ్య తేడాలు

ఆ తరువాత విక్రమ్ - సూర్య - విశాల్ - విజయ్ వంటి హీరోలు మెల్లమెల్లగా తెలుగు మార్కెట్ లో వారికంటూ ఒక మార్కెట్ ని సెట్ చేసుకున్నారు. అప్పుడపుడు యువ హీరోలు ఇతర మార్కెట్ లపై కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ ఎవరెను కూడా అంతగా గుర్తింపు అందుకోలేదు. ఇక ఇప్పుడు మరో హీరో తెలుగు మార్కెట్ పై కన్నేసినట్లు తెలుస్తోంది. అతనెవరో కాదు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ కరుణానిధి మనవడు..ప్రస్తుతం డీఎంకె అధ్యక్షుడు ఎంకె స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్.

గతంలో ఒరు కల్ ఒరు కన్నాడి' సినిమాను తెలుగులో 'OK OK' టైటిల్ తో రిలీజ్ చేసి ఓ వర్గం ప్రేక్షకులను ఆకర్షించాడు. ఆ తరువాత మళ్ళీ కనిపించని ఉదయనిధి తమిళ్ లో ఎన్ని సినిమాలు చేసినా సరైన సక్సెస్ అందుకోలేదు. అప్పుడపుడు రాజకీయాల్లో కొనసాగుతూ జనాలను ఆకర్షించాడు. ఇక మొత్తానికి నెక్స్ట్ సినిమాతో గ్రాండ్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడట.

ఒకేసారి తమిళ్ తెలుగులో రిలీజ్ చేయాలనీ మంచి సోషల్ పాయింట్ కథతో రాబోతున్నట్లు తెలుస్తోంది.  ఇక సినిమాకు సైకో అనే టైటిల్ ని కూడా సెట్ చేసారట. త్వరలోనే సినిమాకు సంబందించిన స్పెషల్ లుక్ ని రిలీజ్ చేసి తెలుగులో కూడా సినిమాను ప్రమోట్ చేయాలనీ ఉదయనిధి ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. అలాగే తదుపరి సినిమాలను కూడా మనోడు రెగ్యులర్ గా రిలీజ్ చేయాలనీ డిసైడ్ చేసినట్లు టాక్. మరి ఆ ప్లాన్స్ ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి.