చెన్నైకి చెందిన టీవీ సీరియల్ కెమెరామెన్ జోలార్ పేట బస్టాండ్ కి దగ్గరలోనే ఆత్మహత్యకి పాల్పడ్డాడు. చెన్నై వలసరవాక్కం గంగమ్మ వీధికి చెందిన శశికుమార్ (47) టీవీ సీరియల్ కెమెరామెన్ గా పని చేస్తున్నాడు. అతడికి భార్య రాఘవి కుమార్తె ఉన్నారు.

అయితే శశికుమార్ పని చేస్తున్న స్టూడిలో ఉన్న కెమెరాను రూ.2 లక్షలకు తాకట్టు పెట్టినట్లు తెలిసింది. దీంతో స్టూడియో యాజమాన్యం విరుగంబాక్కం పోలీసులకు శశికుమార్ పై ఫిర్యాదు చేశారు. మనస్తాపానికి గురైన శశికుమార్ ఈ నెల 9న ఇంటి నుండి బయటకి వచ్చి తిరిగి ఇంటికి వెళ్లలేదు.

బిగ్ బాస్ 3: అతడితో బ్రేకప్.. చచ్చిపోదాం అనుకున్నా.. శ్రీముఖి కామెంట్స్!

ఆ తరువాత వేలూరు జిల్లా జోలార్ పేట బస్టాండ్ సమీపంలోని చెరువు గట్టు వద్దనున్నఓ చెట్టుకి శశికుమార్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు గురువారం కొందరు స్థానికులు గుర్తించి వెంటనే జోలార్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని హాస్పిటల్ కి తరలించి విచారణ చేపట్టారు. అనంతరం అతడి పర్స్ లో ఉన్న ఫోటోలను పరిశీలించగా.. అందులో భార్య, కుమార్తె ఫోటో ఉన్నట్లు గుర్తించారు. సెల్ ఫోన్ నెంబర్ ద్వారా వివరాలు తెలుసుకున్న పోలీసులు కుటుంబసభ్యులకు సమాచారం అందజేశారు. అతడి భార్య రాఘవి భర్త మృతిపై అనుమానం ఉందని జోలార్ పేట పోలీసులకు కంప్లైంట్ చేసింది. పోలీసులు ప్రస్తుతం విచారణ చేపట్టారు.